భద్రాచలం వాసులకు 'సెప్టెంబర్' భయం..కారణం పోలవరమేనా ?

Veldandi Saikiran
* గోదావరి నదితో భద్రాచలంకు భయం.. భయం
* భద్రాచలంకు సెప్టెంబర్‌ భయం
* పోలవరం ఎత్తు పెంచడమే కొంపముంచుతుందా ?
* భద్రాచలం ముంపుపై తెలంగాణ, ఏపీ మధ్య వార్‌

వర్షాలు సమృద్ధిగా పడితే రైతులకు న్యాయమే జరుగుతుంది. అదే విపరీతంగా వర్షాలు పడితే తీవ్ర నష్టం కూడా జరుగుతుందన్న సంగతి తెలిసిందే. అయితే భారీ వర్షాలు ఒక ప్రాంతంలో.. మంచి చేస్తే మరొక ప్రాంతంలో చెడును  చేయడం జరుగుతుంది. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి నీరు అందించేది గోదావరి నది.  అలాంటి గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తే.. కొన్ని ప్రాంతాలు కచ్చితంగా మునిగిపోతాయి.

అలాంటి ప్రాంతాలలో ఖమ్మం జిల్లా ఒకటి. ఖమ్మం లోని భద్రాచలం ప్రత్యేకంగా జిల్లా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తే... భద్రాచలం జిల్లాలోని చాలా ప్రాంతాలు మునిగిపోవడం మనం చూస్తున్నాం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఈ పరిస్థితులు చాలానే కనిపిస్తున్నాయి. 2023 సంవత్సరంలో... అంటే కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు... మహారాష్ట్ర అలాగే తెలంగాణ రాష్ట్రాలలో విపరీతంగా వర్షాలు పడ్డాయి.

అయితే ఈ రెండు రాష్ట్రాలలో వర్షాలు పడడంతో గోదావరి ఉధృతంగా ప్రవహించింది. దీనివల్ల భద్రాచలం పూర్తిగా మునిగిపోయింది. దాదాపు భద్రాద్రి రామచంద్రుడి గుడి వరకు నీళ్లు వచ్చాయి. ఆ సమయంలో కేసీఆర్ ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయి... సహాయక చర్యలు అందించింది. అయితే పోలవరం ఎత్తు పెంచడం కారణంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయని గులాబీ పార్టీ నేతలు మొదటి నుంచి చెబుతున్నారు. అయితే.. భద్రచాలం ఎప్పుడు మునిగినా.. సెప్టెంబర్‌ నెలలోనే జరుగుతోంది. అందుకే సెప్టెంబర్‌ వస్తే భద్రాచలం ప్రజలు వణికిపోతారు.

ఎక్కువగా నీళ్లను స్టోరేజ్ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం పోలవరం ఎత్తును పెంచింది.  దీనికి కేంద్రం అనుమతులు కూడా ఉన్నాయి. ఈ తరుణంలోనే ముంపు ప్రాంతాలుగా ఏడు మండలాలను కూడా గుర్తించి ఏపీలో కలిపింది కేంద్రం. ఇక అప్పటి నుంచి వరదలు విపరీతంగా వస్తే భద్రాచలం కచ్చితంగా మునుగుతోంది. కాబట్టి ఏపీ అలాగే తెలంగాణ ప్రభుత్వాలను కూర్చోబెట్టి...  భద్రాచలం వరద ముంపునకు గురికాకుండా చూసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: