మ‌ళ్లీ సాక్షి పేప‌ర్ రు. 2 కే... ఈ ఆఫ‌ర్ కూడా బ‌తిమిలాడి మ‌రీ...?

RAMAKRISHNA S.S.
సాక్షి పత్రిక సర్క్యులేషన్ చాలా దారుణంగా పడిపోయింది. ప్రింట్, ఆర్డర్.. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి కనీసం నాలుగు లక్షల కూడా లేదని తెలుస్తోంది. చివరకు ఎంతకు దిగజారిపోయారు అంటే.. ఇష్టం వచ్చినట్టుగా ప్రింట్ చేసి దానిపై కాంప్లిమెంటరీ కాపీ అని స్టాంప్ వేసి అడగకపోయినా ఇళ్లలో పడేస్తున్నారట. మనుషులను పెట్టి మార్కెటింగ్ చేస్తున్న సాక్షి సర్కులేషన్ ఏమాత్రం పెరగటం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో సాక్షి పత్రిక మొత్తం ప్రజాధనంతో బతికేసింది అని చెప్పాలి.

వందల కోట్ల ప్రకటనలు మాత్రమే కాదు.. ప్రజాధనంతో రోజులు లక్షల కాపీలు కొనుగోలు చేయించేవారు. వాలంటీర్లు.. సచివాలయ ఉద్యోగులు, మామూలు ఉద్యోగులు.. యూనివర్సిటీలు ఇలా దేనిని వదలకుండా ప్రతి ప్రభుత్వ వ్యవస్థలను సాక్షి పేపర్ ను ప్రజాధనంతో కొనిపించారు. ఎలాగైనా ఈనాడును బ్రేక్ చేయాలని జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. అసలు ఇక తెలంగాణలో సాక్షిని పట్టించుకునే వారే లేరు. ఏపీలో ఇప్పుడు వాళ్లకు రాజకీయంగా అవసరం కాబట్టి.. కాంప్లిమెంటరీ కాపీలు వేస్తున్నారు. సంవత్సర చందా కేవలం 1250 రూపాయలు మాత్రమే అని బతిమిలాడుతున్నారు.

అంతేకాదు ఓ కుక్కర్ లేదా ఇంకో గిఫ్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఏడాది చందా రూ. 1250 పెట్టి తీసుకుంటే అందులో సగం మొత్తం గిఫ్ట్ రూపంలో ఇచ్చేస్తారు అన్నమాట. అంటే సాక్షి మళ్ళీ రెండు రూపాయల స్టేజ్ కు వచ్చేసింది. సాక్షి పత్రిక పెట్టినప్పటి నుంచి అక్రమ సంపాదన.. అవినీతి మూలాలు ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అప్పట్లో రూ.2కే పేపర్ ఇస్తూ ఇతర పత్రికలు కూడా అదే రేటుకు ఇవ్వాలని ఉద్యమం చేశారు. ఇప్పుడు అన్ని పత్రికలు రూ.6 కు అమ్ముతున్నాయి. కాబట్టి ఇప్పుడు తప్పుడు మార్కెటింగ్ వ్యూహాలతో సాక్షి రూ.2కు ఇచ్చే స్థాయికి దిగజారిపోయిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: