2009 కృష్ణమ్మ తెచ్చిన కష్టాలు..కళ్ళముందు తేలియాడిన నష్టాలు.!
- రోడ్డున పడ్డ వేలాది మంది ప్రజలు
- 2009 హృదయ విధారక ఘటనకు 15 ఏళ్లు.
2009 కృష్ణమ్మ ఉగ్రరూపం పేరు చెప్పగానే ఇప్పటికీ ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. దాదాపు పదివేల సంవత్సరాలలో అత్యధిక వరదలు వచ్చింది ఈ సంవత్సరమే నట. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నష్టపరిచింది కృష్ణమ్మ వరదలు అని చెప్పవచ్చు. ఈ వరదల దాటికి వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. పశుపక్షాదులు, పంటలు ఎన్నో నష్టపోయాయి. అప్పటివరకు కరువుతో కొట్లాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన వరదలు రావడంతో దారుణమైన నష్టం జరిగింది. ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణమ్మ ఉగ్రరూపానికి తట్టుకోలేక పోయారు. అలాంటి 2009 కృష్ణమ్మ వరదల కన్నీటి గాధలకు 15 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.
కృష్ణమ్మ కష్టాలు:
అది 2009 అక్టోబర్ 5వ తేదీ రాత్రి 11 గంటల సమయం అవుతుంది. కృష్ణానది తీవ్ర ఉగ్రరూపం దాలుస్తోంది. కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ పై వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. ముందుగా ఆదివారం సాయంత్రానికి బ్యారేజీ వద్ద 9.02 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక అర్ధరాత్రి 11 దాటేసరికి 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ఇక నిమిష నిమిషానికి వరద నీరు పెరుగుతూనే ఉంది. ఇక అర్ధరాత్రి వచ్చేసరికి 11,10,404 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్. దీంతో ఎగువన ఉండే శ్రీశైలం, నాగార్జునసాగర్ లోకి పెద్ద ఎత్తున ప్రవాహం వెళ్తోంది. దీంతో నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ భయంతో ఉన్న సమయంలోనే వరదలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి.
వరదలకు కారణం:
ముఖ్యంగా కృష్ణా జిల్లా మొత్తం తూర్పు తీర ప్రాంతంలో ఉంది.ఈ ప్రాంతం బంగాళాఖాతానికి దగ్గరగా ఉండటం వల్ల అల్పపీడనం ఏమాత్రం ఏర్పడిన ఇక్కడ తుఫాన్లు భారీ వర్షాలు, వరదలు సంభవిస్తూ ఉంటాయి. ఇలా 2009 తర్వాత ఇప్పటివరకు ఇంతటి వరదలు ఏపీని చుట్టుముట్ట లేదని చెప్పవచ్చు.