దివిసీమను ముంచేసిన వరద.. అన్నదాతలకు ప్రభుత్వం సహాయం చేస్తుందా?
గ్రామంలో 10 అడుగుల ఎత్తులో వరద ప్రవహిస్తుండటంతో గ్రామస్థులు టెన్షన్ పడుతున్నారు. వరద బాధితులను అధికారులు పునరవాస కేంద్రాలకు తరలించడం గమనార్హం. ఎగువన కురిసిన భారీ వర్షాల వల్ల దివిసీమకు వచ్చిన వరద నీటి వల్ల మెట్ట పొలాలు పంట చేతికి రాకముందే నీటిపాలు కావడం జరిగింది. ఆక్వా రంగం కూడా పూర్తిగా కుదేలైందని తెలుస్తోంది. కృష్ణానది పక్కన ఉన్న చెరువులు సైతం పూర్తిగా దెబ్బ తినడం గమనార్హం.
అరటి, కంద, పసుపు, మొక్కజొన్న తదితర పంటలు వరద నీటిలో మునిగి రైతులు తీవ్రస్థాయిలో నష్టపోవడం జరిగింది. గతంలో ఎన్నడూ చూడనంత నష్టాన్ని చవిచూశామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా వరద నీరు చేరడం వల్ల పెట్టుబడి బూడిద పాలైందని రైతులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించకుండా గతంలో ఎన్నడూ చూడనంత నష్టాన్ని చవిచూశామని రైతులు ఆవేదన వ్యక్తం రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అవనిగడ్డ డివిజన్ లో మొత్తం 10 పునరావాస కేంద్రాలు ఉండగా మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్ రామ్ రాత్రీ, పగలూ కరకట్టపై వరద పరిస్థితులను పర్యవేక్షిస్తూ కరకట్టను కాపాడుకుంటూ ఉండటం గమనార్హం. విజయవాడను వరద ముంచెత్తడంతో జనావాసాలు ప్రస్తుతం జలదిగ్భంధంలో మునిగిపోయాయి. వర్షాల వల్ల ప్రజలకు ఊహించని ఇబ్బందులు ఎదురవుతుండటం కొసమెరుపు. ఏపీ ప్రభుత్వం వీలైనంత వేగంగా స్పందించి ఆదుకుంటే మాత్రమే ప్రజలకు ఈ ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందేమో చూడాలి.