వరద రాజకీయం: తుమ్మల నాగేశ్వరరావుని ఏకపారేస్తున్న ఖమ్మం ప్రజలు..?

Suma Kallamadi
* ఖమ్మంలో మున్నేరు ముప్పు
* కరకట్ట నిర్మాణంతో ప్రజలకు వరద ముప్పు ఉండదు
* కానీ దాని గురించి పట్టించుకోని మంత్రి తుమ్మల
( తెలంగాణ - ఇండియా హెరాల్డ్)
మొన్న కురిసిన వర్షానికి ఖమ్మంలోని మున్నేరు వాగుకు భారీ వరద వచ్చింది. గత వందేళ్లలో ఎన్నడూ లేనంత వరద పోటెత్తింది, జస్ట్ గంటల వ్యవధిలోనే 45 సెంటీమీటర్ల వర్షం కురవడమే ఇంత పెద్ద విపత్తుకు కారణమయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ మున్నేరు కరకట్టకు రూ.690.53 కోట్ల కేటాయించారు. టెండర్లు కూడా ఫైనలైజ్ చేశారు. అయితే ఈ కరకట్ట ప్రారంభానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పటికే 9 నెలలు గడిచిపోయాయి కానీ కరకట్ట గురించి ఏ కాంగ్రెస్ నేత నోరు మెదపలేదు.
మున్నేరు నదికి టూ సైడ్స్ 8.5 కి.మీ పొడవు చొప్పున మొత్తం 17 కి.మీ పొడవుగా 33 అడుగుల ఎత్తుతో ఆర్‌సీసీ వాల్‌ కడితే మున్నేరు చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరూ వరదల నుంచి ఉపశమనం పొందుతారు కానీ ఈ కరకట్ట కనీసం ప్రారంభించడానికి కూడా కాంగ్రెసు మంత్రులు ఆసక్తి చూపలేదు. తీరా ఇప్పుడు భారీ ఎత్తున వర్షాలు వచ్చిన తర్వాత వరద బాధితులనుంచి పరామర్శిస్తున్నారు. దీని వల్ల ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ముందు చూపుతో కరకట్ట కట్టి ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో తమకు వచ్చి ఉండేవి కాదు కదా అని వాపోతున్నారు. ఏ అర్ధరాత్రో భారీ వర్షాలు వస్తే తమ జీవితాలు జల సమాధి అవుతాయని కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరకట్ట కోసం ఇంకా ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరణ కూడా పూర్తి కాలేదట. మొదలుపెడదాం అనుకునే లోపే వర్షాకాలం మొదలైంది అని కాంగ్రెస్ నేతలు సాకులు చెబుతున్నారు.
వరద కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే వారికి కావాల్సిన నిత్యవసరాలు సరఫరా చేయడంలో కూడా మంత్రి తుమ్మల ఆలస్యం చేస్తున్నారని తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. టెస్కో నుంచి దుప్పట్లు, చీరలు, ధోతీలు, దుస్తులు పంపిణీ చేస్తామని చెప్పారని కానీ ఇప్పటిదాకా తమకు అందలేదని కొంతమంది మీడియాతో తెలిపారు. భోజనాలు కూడా లభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గృహకల్పలోని వరద బాధితులకు పదివేల చొప్పున నష్టపరిహారం అందించాలంటూ కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తంకుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ తదితరులు కూడా వరద బాధితులను కలిశారు. స్టడీ సర్టిఫికెట్స్ కోల్పోయిన వారికి కొత్త సర్టిఫికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే పశువుల నష్టం వాటిల్లితే 50,000 అందజేస్తామని ప్రకటించారు. కానీ ఏది ఏమైనా కరకట్ట కట్టేదాకా ప్రజలకు రిలీఫ్ ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: