బాబ్‌ గేమ్‌ షురూ...పవన్‌ కళ్యాణ్‌ కు వెన్నుపోటు?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం.. రాజ్యసభ ఎంపి స్థానాలపై పంచాయతీ నెలకొంది. గత వారం రోజుల కిందట వైసీపీ పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ ఇద్దరు తమ రాజ్యసభ పదవులకు రాజీనామా చేయడం జరిగింది. అదే సమయంలో వైసీపీ పార్టీకి కూడా ఈ ఇద్దరు నాయకులు రాజీనామా చేశారు. త్వరలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోను ఉన్నారని సమాచారం.

అయితే.. ఈ ఇద్దరు రాజీనామా చేయడంతో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.  ఆ స్థానాలను కచ్చితంగా తెలుగుదేశం కూటమికి చెందిన నేతల ద్వారా భర్తీ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఈ రెండు స్థానాలలో కచ్చితంగా జనసేన, తెలుగుదేశం నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ రానున్నట్లు సమాచారం. అయితే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నుంచి... గల్లా జయదేవుకు అవకాశం వస్తుందని అందరూ చర్చించుకున్నారు.
 
అటు జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ నాగబాబుకు ఛాన్స్ ఇవ్వనున్నారని వార్తలు వచ్చాయి. టిటిడి చైర్మన్ ఆశించిన నాగబాబుకు భంగం కలగడంతో... ఈసారి ఎలాగైనా రాజ్యసభ వస్తుందని అనుకున్నారు. అయితే ఇక్కడే జనసేన పార్టీకి ఎదురు దెబ్బ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు రాజ్యసభల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు నాయకులను పంపించాలని చంద్రబాబు స్కెచ్ వేస్తున్నారట.
 
అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు... ఈ ఇద్దరినీ ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలలో పంపించాలని చంద్రబాబు స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జనసేనకు ఇప్పుడు పదవులు ఇవ్వలేమని... నామినేటెడ్ పద వుల్లో ఎక్కువగా జనసేనకు ఇస్తామని చంద్రబాబు.. చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీని పై జనసేన పార్టీ నేతలు తీవ్రంగా మండి పడుతున్నారట. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు మళ్లీ మొదలుపెట్టాడని అంటున్నారట. మరి దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: