తెలంగాణ రాష్ట్రంలో... ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించి... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ.. తమ ఆరు గ్యారెంటీలను ఎక్కడ అమలు పరచడం లేదు అంటూ గులాబీ పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రజల్లో కూడా ఇదే వాదన స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం... చీరికల పైన దృష్టి పెట్టింది. ఇప్పటికి పది మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే అదే సమయంలో.... జగన్మోహన్ రెడ్డికి సలహాదారులుగా సజ్జల రామకృష్ణ ఉన్నట్లుగానే.... సీఎం రేవంత్ రెడ్డి కి కూడా మరొక వ్యక్తి తయారయ్యారు. ఆయనే వేం నరేందర్ రెడ్డి.
వేం నరేందర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన మొదట తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులుగా ఎదిగారు. ఓటుకు నోటు కేసులో కూడా వేం నరేందర్ రెడ్డి పాత్ర ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి అలాగే వేం నరేందర్ రెడ్డి ఇద్దరు టిడిపి నుంచే మంచి మిత్రులు. ఏం చేసినా ఎక్కడికి వెళ్లినా వీరిద్దరే వెళ్లేవారు. రేవంత్ రెడ్డికి ఎప్పుడు డబ్బు సహాయం కావాలన్నా... వేం నరేందర్ రెడ్డి చూసుకునేవారు.
అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వేం నరేందర్ రెడ్డి కి ప్రభుత్వ సలహాదారు పాత్ర ఇచ్చారు. దీంతో.... ఏపీలో గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసినట్లుగానే... అన్ని తానే చేస్తున్నారు వేం నరేందర్ రెడ్డి. పార్టీ చేరికలనుంచి మొదలుపెడితే... సంక్షేమ పథకాలు అలాగే ఉద్యోగాల జారీ అంశం కూడా... వేం నరేందర్ రెడ్డి కను సన్నల్లోనే జరుగుతోంది. దీంతో రేవంత్ రెడ్డి టీంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.