ఏపీలో చరిత్ర సృష్టించిన పవన్ గెలుపు.. ఎమ్మెల్యేగా గెలవడానికి పవన్ ఒక యుద్ధమే చేశారుగా!

Reddy P Rajasekhar
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. రీరిలీజ్ లో సైతం పవన్ కళ్యాణ్ సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయంటే ఆయన రేంజ్ ఏంటో సులువుగా అర్థమవుతుంది. గబ్బర్ సింగ్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా 4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపు ఏపీలో చరిత్ర సృష్టించింది. పవన్ కళ్యాణ్ కు రికార్డ్ స్థాయిలో మెజారిటీ సైతం వచ్చింది.
 
2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సమయంలో పవన్ కళ్యాణ్ పై వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావు. రాజకీయాల్లో పవన్ ఎమ్మెల్యేగా గెలవడం కష్టమని కొంతమంది కామెంట్లు చేస్తే పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి ఇతర పార్టీల నేతలు పడిన కష్టం అంతాఇంతా కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మెల్యేగా గెలవడానికి పవన్ ఒక యుద్ధమే చేశారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
 
పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడంతో పాటు డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. తను కాకుండా జనసేన నుంచి పోటీ చేసిన మరో 20 మందిని గెలిపించుకోవడంలో సక్సెస్ సాధించారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రజలకు పూర్తిస్థాయిలో పవన్ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడుతున్నారు.
 
పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా తనదైన వ్యూహాలతో ముందుకెళ్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ ప్లాన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. పవన్ పుట్టినరోజు అభిమానులకు పండుగ రోజు కాగా ఈరోజు పవన్ సినిమాల నుంచి ఎలాంటి క్రేజీ అప్ డేట్స్ వస్తాయో చూడాల్సి ఉంది. పాలిటిక్స్ లో సంచలనాలు సృష్టించిన పవన్ కళ్యాణ్ సినిమాల్లో సైతం భారీ విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ పాన్ ఇండియా రేంజ్ హిట్లను అందుకుంటే అభిమానుల సంతోషానికి అవధులు ఉండవు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: