* పవన్ కళ్యాణ్ జీవితాన్నే మార్చేసిన ఎన్నో పుస్తకాలు.!
* పవన్ ను ప్రభావితం చేసిన అక్క విజయదుర్గ జీవితం.?
* 'చేగువేరా' జీవితమే స్ఫూర్తిగా తీసుకున్న పవన్..!
* రాజకీయా పంధాన్ని అందించిన పుస్తకంగా 'ఖారవేలుడు'.!
(ఏపీ-ఇండియాహెరాల్డ్ ): రెండు తెలుగు రాష్ట్రాల యూత్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఆ పేరు వింటేనే అటు సినిమాల్లో అయినా ఇటు రాజకీయాల్లో అయినా..బాడీలో ఒక తెలియని వైబ్రేషన్ రాక మానదు.సినిమాల్లోకి రాకముందు చిరంజీవి తమ్ముడిగానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కల్యాణ్ బాబు ఆ తర్వాత తన పవర్ ఏమిటో చూపించి పవన్ కల్యాణ్‌గా మారారు.కళ్యాణ్ బాబు కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు మూడవ కుమారునిగా ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో జన్మించాడు.ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు.పవన్ కళ్యాణ్ తన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా బాపట్లలో సాగింది ఆయన తండ్రి వెంకటరావు గారు స్వాతహాగా ప్రభుత్వ ఉద్యోగి కావడంతో రెండు, మూడేళ్లకు బదిలీ అయ్యేవారు దాంతో పవన్ కళ్యాణ్ విద్యాభ్యాసం వివిధ ప్రాంతాల్లో సాగింది.నెల్లూరులో తాను ఉన్నత ప్రాధమిక విద్య నుండి కంప్యూటర్ డిప్లొమా పొందే దాక అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అయితే పవన్కు విద్యాభ్యాసం పూర్తి ఐనా ఉద్యోగం చేయాలని ఉద్దేశం మాత్రం ఉండేది కాదు పుస్తకాలు ఎక్కువగా చదువుతుండేవాడు. అప్పటికే స్టార్ హీరోగా ఎదిగిన అన్నయ్యను చూసి సినిమాల్లోకి వెళ్లాలని ఆలోచన వచ్చింది కానీ అది కూడా నచ్చక ఆలోచన విరమించుకున్నాడు.అయితే పవన్ కళ్యాణ్ ఇంటర్ చదువుతున్నప్పుడే తన అక్క దుర్గాకి సాయి ధరంతేజ్, కంప్యూటర్ డిప్లొమా చదుతునప్పుడు వైష్ణవ్ తేజ్ జన్మించి ఉన్నారు కానీ దుర్గ గారి భర్త ఆమెను సరిగ్గా చూసుకునేవారు కాదు దాంతో పవన్ కళ్యాణ్ చాలా బాధపడుతూ తాను దాచుకున్న పాకెట్ మనీతో మేనల్లుడులను అలాగే తన అక్కను బాగా చూసుకునేవారు.
అవిధంగా 1992-93 నాటికి పవన్ మెదదంత తన అక్క లైఫ్ గూర్చి ఆలోచనలతో నిండిపోయింది స్వాతహాగా పుస్తకాలు చదివే అలవాటున్న పవన్ కీ పుస్తకాలు చదివే కొద్దీ ఈ సమాజంపై విపరీతంగా కోపం మరోపక్క బాధ కూడా పెరిగిపోయేది. దాంతో ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్న పవన్ ఆ తర్వాత కార్లు మార్క్స్, చెగువేరా లాంటి నాయకుల పుస్తకాలు,ప్రపంచ చరిత్ర, అలాగే తన తండ్రి ఇచ్చిన 'తాకట్టులో భారతం' లాంటి పుస్తకాలు చదివి జీవితం అంటే ఏంటో తెల్సుకొని ముందుకు సాగారు.ఆ తర్వాత అన్నయ్య చిరంజీవి సలహా మేరకు తన తల్లిదండ్రులతో పాటు అక్క దుర్గ, మేనల్లుడులను తీస్కొని చెన్నై వెళ్ళి అన్నయ్య సలహా మేరకు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు కళ్యాణ్ బాబు.మొదటగా సత్యానంద్ దగ్గర యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకొని తర్వాత ఈవీవీ డైరెక్షన్లో 'అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి'.. మూవీతో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు కాకపోతే అప్పట్లో చిరంజీవి తమ్ముడని మాత్రమే ప్రేక్షకులు ఆదరించారు కానీ సినిమా మాత్రం యావేరేజ్ గా నిల్చింది.ఆ తర్వాత చేసిన గోకులంలో సీత, సుస్వాగతం,తొలిప్రేమతో...సూపర్ హిట్ గా నిలవడంతో ఇంకా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు పవన్కళ్యాణ్.తొలిప్రేమ మూవీ కీ గాను జాతీయ అవార్డు, నంది అవార్డ్స్ దక్కాయి. ఇక ఆతర్వాత తమ్ముడు, బద్రి, ఖుషి లాంటి బ్లాక్ బస్టర్స్ తో పవన్ కళ్యాణ్ కు పెరిగిన క్రేజ్ ఇప్పటికి కొనసాగుతుంది అంటే.. ఆయన రేంజ్ ఎలా ఉందొ చెప్పాల్సిన పనిలేదు.
ఆ తర్వాత కొన్ని సినిమాలు పవన్ అభిమానులను బాగా నిరాశపరుస్తున్న టైంలోనే అన్నయ్య చిరు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం ఆతర్వాత రాజకియంగా చోటు చేసుకున్న పరిణామలకి చిరు పార్టీను కాంగ్రెస్లో విలీనం చేయడం దానికి తీవ్ర నిరాశ చెందిన పవన్ రాజకీయాల్లోకి రావడం... పదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ జీవితం ఒక మలుపు తీసుకోవడం ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి డిప్యూటీ సీఎంగా ఉండడం అనేది పవన్ కళ్యాణ్ యొక్క కృషి, కసి, పట్టుదలకి నిదర్శనం. అయితే పవన్ కళ్యాణ్ చదివే చేగువేరా లాంటి విప్లవ వీరుల పుస్తకాలు అలాగే తన అన్నయ్య నాగబాబు ఇచ్చిన 'ఖారవేలుడు' పుస్తకం అనేది రాజకియంగా ఆయనకు ఆదర్శంగా నిల్చినవి అని చెప్పవచ్చు.