జగన్ ఆ ఇద్దరిని పక్కన పెట్టకపోతే వైసీపీ నాశనమే..?
వైసిపి జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రా రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ వర్గాల్లో.. ఏపీ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి. ఆయన సాక్షి ఛానల్ వేదికగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు. వైసిపి రాజ్యసభ సభ్యులను ఇతర పార్టీలకు పంపుతున్నారని.. విజయసాయిరెడ్డి పై ఆరోపణలు వస్తున్నాయని.. ఇందులో నిజా నిజాలు ఏమిటో..? ఆయన చెప్పాలని.. రవిచంద్ర రెడ్డి డిమాండ్ చేశారు.
అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిని.. అసాంఘిక ... అరాచక రాజ్యాంగేతర శక్తిగా రవిచంద్రా రెడ్డి అభివర్ణించారు. పైగా వైసీపీ సొంత ఛానల్ వేదికగా.. తీవ్ర ఆరోపణలు చేయటం వైసిపి వర్గాలకు అసలు మింగుడు పడటంలేదు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల కోవర్ట్ అని.. ఆయన వల్లే పార్టీ సర్వ నాశనమై దారుణంగా ఓడిపోయిందని.. రవిచంద్ర రెడ్డి ఆరోపించడం ఘమనార్హం. ఓవైపు డిబేట్ చేస్తున్న.. కొమ్మినేని శ్రీనివాసరావు వారిస్తున్నా కూడా.. రవిచంద్ర రెడ్డి అసలు వినిపించుకోలేదు. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సాక్షి ఛానల్ వేదికగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు.
రవిచంద్రా రెడ్డి కామెంట్స్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాజిటివ్ స్పందన వస్తోంది. ముందు నుంచి కూడా విజయ్ సాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నేతల వల్ల, కోటరీ వల్ల జగన్‌కు అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో..? నిజా నిజాలు తెలియలేదని అంటున్నారు. ఇప్పుడు సాక్షాత్తు రవిచంద్రారెడ్డి ఈ విషయాన్ని బయట పెట్టడంతో.. వైసిపి వీరాభిమానాలు ముందు నుంచి ఏ విషయంలో జగన్ పట్ల వ్యతిరేకత, అసహనంతో ఉన్నారో.. అదే నిజం అని క్లారిటీ వచ్చింది. మరి జగన్ ఇప్పటికైనా తన తప్పు ఏంటో..? తెలుసుకుని కోటరీని పక్కనపెట్టి డైరెక్ట్ గా నాయకులు .... కేడర్‌కు కనెక్ట్ అవుతారేమో చూడాలి.