పవన్‌ కళ్యాణ్‌కు వెన్నుపోటు...ఆ సీట్లు టీడీపీకేనా ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యసభ సీట్ల కోసం... కొట్లాట జరుగుతోంది. రెండు రోజుల కిందట వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ అలాగే బీద మస్తాన్ రావు ఇద్దరూ తమ రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. వైసిపి పార్టీకి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు ఈ ఇద్దరు ఎంపీలు. అయితే ఈ ఇద్దరు రాజీనామా చేయడంతో ఏపీలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.

సంఖ్యాబలంగా చూసుకున్నట్లయితే.... చంద్రబాబు కూటమి పార్టీలు ఈ రెండు రాజ్యసభ సీట్లను దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఈ తరుణంలోనే తెలుగుదేశం పార్టీకి ఒకటి అలాగే జనసేన పార్టీకి మరొక సీటు రాబోతుందని ప్రచారం జరిగింది. నిన్నటి వరకు గల్లా జయదేవ్, జనసేన తరఫున నాగబాబుకు రాజ్యసభ సీటు వస్తుందని ప్రచారం జరిగింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని కూడా ప్రచారం చేశారు.
 

అయితే ఇంతలోనే... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.  ఈ రెండు రాజ్యసభ సీట్ల ను పవన్ కళ్యా ణ్ పార్టీకి కాకుండా.... కేవలం తెలుగుదేశం పార్టీ నేతలకు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారట.  ఏపీలో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశంకు తప్ప వేరే పార్టీకి ఇచ్చేది లేదని అనుకుంటున్నారట.
 

ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వ సలహాదారులు యనమల రామకృష్ణ, అశోక్ గజపతి పేర్లను రాజ్యసభ సీట్ల కోసం తెరపైకి తీసుకువచ్చారట నారా చంద్రబాబు నాయుడు. వీరిద్దరినీ రాజ్యసభకు పంపాలని అనుకుంటున్నారట. ఒకవేళ ఇద్దరు కాదనుకుంటే కంభంపాటి రామ్మోహన్రావు, లేదా వర్ల రామయ్య పేర్లు వినిపిస్తున్నట్లు సమాచారం.మొత్తానికి రెండు రాజ్యసభ సీట్లు తెలుగుదేశం కూటమిలో కొత్త పంచాయతీ తీసుకువచ్చాయి. మరి ఈ రెండు రాజ్య సభ సీట్లు తెలుగు దేశం కూటమి పార్టీలు ఎలా పంచుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: