వైసీపీని బొంద పెట్టేందుకు చంద్ర‌బాబు న‌యా స్కెచ్ ఇది...!

RAMAKRISHNA S.S.
ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు వైసీపీ ని పూర్తిగా బొంద పెట్టేందుకు అదిరిపోయే స్కెచ్ వేస్తున్నారా ?   బాబు మార్క్ న‌యా వ్యూహంతో వైసిపి ఖాళీ అయిపోతుందా ? ఇదీ ఇప్పుడు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోన్న చ‌ర్చ‌. రాజ‌కీయాల్లో స‌హ‌జంగానే ప్ర‌త్య‌ర్థు ల‌ను పూర్తిగా దెబ్బ కొట్ట‌డం... పార్టీల‌ను ఖాళీ చేయ‌డం అనేది కామ‌న్ గా జ‌రుగుతూ వ‌స్తూ ఉంటుంది. ఒక‌ప్పుడు ప్ర‌తిప‌క్షాల‌ను గౌర‌వించా ల‌ని.. ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన వారిని త‌మ పార్టీలో చేర్చు కోకూడ‌దు అన్న నిబంధ‌న ఉండేది.

ఎవ‌రైనా ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన వారు త‌మ పార్టీలోకి రావాలి .. వారిని తీసుకోవాలి అనుకున్న‌ప్పుడు వారిని ఆ పార్టీ తో పాటు ఆ పార్టీ నుంచి ల‌భించిన ప‌ద‌వి కి కూడా రాజీనామాలు చేయించి.. అప్పుడు మాత్ర‌మే త‌మ పార్టీలోకి తీసుకుని కండువాలు క‌ప్పేవారు. గ‌తంలో ఎప్పుడూ ఒక పార్టీ నుంచి గెలిచిన వారికి మ‌రో పార్టీ కండువా క‌ప్పి ఆ పార్టీలో మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం అనేది జ‌రిగేది కాదు.

అయితే 2014 నుంచి ఇంకా చెప్పాలంటే కాస్త ముందుగానే వైఎస్సార్ ముఖ్య‌మంత్రి గా ఉన్న‌ప్ప‌టి నుంచే ఒక పార్టీ నుంచి గెలిచిన వారిని కాంగ్రెస్ లో చేర్చుకునే వారు. ఆ త‌ర్వాత 2014లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత చంద్ర‌బాబు .. అటు తెలంగాణ లో కేసీఆర్ ఇద్ద‌రూ కూడా ఇత‌ర పార్టీల గుర్తుల మీద గెలిచిన వారిని త‌మ పార్టీలో చేర్చుకుని కేబినెట్ ప‌ద‌వి ఇచ్చి.. మంత్రి గా త‌మ ప‌క్క‌న కూర్చోపెట్టుకోవ‌డం మొద‌లు పెట్టారు.

అప్ప‌టి నుంచే రాజ‌కీయ నాశ‌నం అయిపోయింది. ఇక జ‌గ‌న్ కూడా టీడీపీ , జ‌న‌సేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేల‌ను త‌మ పార్టీలో డైరెక్టు గా కాక‌పోయినా ఇన్ డైరెక్టుగానే చేర్చుకున్నారు. ఇక  ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం గులాబీ ఎమ్మెల్యేల‌ను త‌మ పార్టీలో చేర్చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు కూడా ఇప్పుడు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు.. రాజ్య‌స‌భ స‌భ్యుల‌తో పాటు ఎమ్మెల్సీల‌ను కూడా త‌మ పార్టీలో చేర్చుకుని వైసీపీని పూర్తిగా బొంద పెట్టే ప్లాన్‌లో ఉన్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: