సైలెంట్ గా కేసీఆర్‌ గొంతు కోసిన లక్ష్మీ పుత్రుడు..ఈ ఏజ్‌ ఏంటీ సార్‌ ?

Veldandi Saikiran
* కాంగ్రెస్‌తో పోచారం రాజకీయ అరంగేట్రం
* టీడీపీలో 27 ఏళ్ల పాటు పనిచేసిన సీనియారిటీ
* 2011లో టీఆర్‌ఎస్‌ లో చేరిన పోచారం
* టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రి, స్పీకర్‌ గా అవకాశం


తెలంగాణ రాష్ట్రంలో లక్ష్మీ పుత్రుడుగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి పేరు ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు... కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ పేరు... పోచారం శ్రీనివాస్ రెడ్డికి పెట్టారు. అయితే అలాంటి... పోచారం శ్రీనివాస్ రెడ్డి... 10 సంవత్సరాల పాటు టిఆర్ఎస్ లో అనేక పదవులు అనుభవించి... ఇప్పుడు పార్టీ మారిపోయారు. కష్టాల్లో ఉన్న కేసీఆర్ ను వదిలేసి... రేవంత్ రెడ్డి చెంతకు చేరిపోయారు లక్ష్మీ పుత్రుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి.

వాస్తవంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కెరీర్ ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీ నుంచి కావడం విశేషం.  కానీ 1990 కంటే ముందే టిడిపిలో పనిచేశారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. టిడిపిలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.... ఆ పార్టీలో 27 సంవత్సరాల పాటు కొనసాగారు. అలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న  పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఉద్యమం కోసం 2011లో.. టిడిపికి రాజీనామా పెట్టి కెసిఆర్ చెంతకు చేరారు.

టిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత బాన్స్వాడ బై ఎలక్షన్ లో కూడా.... అఖండ మెజారిటీతో పోచారం శ్రీనివాస్ రెడ్డివిజయం సాధించారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేసీఆర్ అవకాశం కల్పించారు. ఆ సమయంలోనే లక్ష్మీ పుత్రుడుగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి పేరు కూడా వచ్చింది.

ఇక 2018 సంవత్సరంలో కేసీఆర్ రెండో ప్రభుత్వంలో కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ స్పీకర్ పదవి దక్కింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా  పోచారం శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ తరఫున బాన్సువాడ నుంచి విజయం సాధించారు. కానీ మొన్న కాంగ్రెస్ కండువా కప్పుకొని కేసీఆర్కు  వెన్నుపోటు పొడిచారు. అయితే ఇటీవల కాంగ్రెస్ లోకి చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి... వ్యవసాయ శాఖకు సంబంధించిన సలహాదారు పోస్టు కూడా రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: