ఏపీ: పిఠాపురం మహిళలకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్..!
ఈ పూజ కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్ల పైన ఆలయ అధికారులతో సమీక్షించారు. ఈ పూజా కార్యక్రమం చేసుకునే ఆడపడుచులు అందరికీ అమ్మవారి ప్రసాదంగా పసుపు, కుంకుమ, చీర ప్రసాదంగా అందజేయమని.. స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.ఈ 12వేల చీరల్లో.. 6వేల చీరలను పసుపు కుంకుమతో కలిపి అమ్మవారి ప్రసాదంగా ఆలయం దగ్గర పూజ ముగిసిన తర్వాత అందజేయనున్నారు. అయితే మిగిలిన 6వేల చీరలను స్థానిక ఎమ్మెల్యే చేబ్రోలు పార్టీ కార్యాలయంలో ఆడపడుచులకు అందజేయనున్నారు. వరలక్ష్మి వ్రతం కోసం ఆలయంలో భారీ ఏర్పాట్లు చేసినట్లు.. ఈవో భవాని తెలిపారు. ఈ ఏడాది ఆలయం దగ్గర మరింత విశాలమైన స్థలాన్ని కేటాయించామని.. మొత్తం మూడు టీమ్లుగా మహిళలు ఈ వ్రతాన్ని చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేనా.. మజాకా నా అన్నట్టుంది పవన్ కళ్యాణ్ వ్యవహారం. తనను తొలిసారి అసెంబ్లీకి పంపిన పిఠాపురం పై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఆ నియోజకవర్గం లోని ఆడపడుచుల మనసులు గెలుచుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా ఈ శుక్రవారం ఆడపడుచులందరికి ఈ బహుమానం అందజేయనున్నారు.