ఏపీ సిఎం: విద్యార్థులకు డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్..!
అలా EESL కంపెనీ ఇచ్చిన రాయితీని సైతం ఏపీ ప్రభుత్వమే భరిస్తుందని తెలియజేస్తున్నారు. ఎలక్ట్రిక్ సైకిల్ వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చనీ.. అలాగే విద్యార్థులు త్వరగా స్కూల్ లకు కాలేజీకి వెళ్లేందుకు ఇవి చాలా ఉపయోగపడతాయని బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పని ఉండదు అన్నట్లుగా ఏపీ సీఎం ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా కూటమి వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. అలాగే ఆంధ్రప్రదేశ్లోని మహిళలు వారి ఉపాధి అవసరాలకు సైతం సైకిల్ ను ఉపయోగించుకోవచ్చు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేద ప్రజల కోసం నిర్మించే ఇంటికి కూడా సోలార్ విద్యుత్ పరికరాలను అమర్చి సబ్సిడీ పైన ఇవ్వాలని ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలియజేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వీటి ద్వారా పేదలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే కాకుండా చాలా చౌక ధరకే విద్యుత్ పరికరాలను పొందగలరని తెలియజేస్తున్నారు.. అలాగే వీటితో పాటుగా ప్రభుత్వ భవనాలలో కూడా సోలార్ విద్యుత్తుని ఉపయోగించేలా ప్లాన్ చేస్తున్నామని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎలక్ట్రిక్ వస్తువుల పైన సబ్సిడీ ఇచ్చి మరి ప్రోత్సహించేలా ప్రయత్నిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఏపీ సీఎం చంద్రబాబు అనుకుంటున్నట్టుగా ఏ మేరకు ఇవి అమలు అవుతాయి ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తాయో చూడాలి.