సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి నోటీసులు.. హైడ్రా సంచలనాలు మామూలుగా లేవుగా!

Reddy P Rajasekhar
ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. హైడ్రా విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనంతరం హైడ్రా పేరు సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగింది. చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలను నిర్మించిన అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టే విధంగా హైడ్రా అధికారులు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సంచలనం రేపుతోంది. నగరంలోని మాదాపూర్ లో ఉన్న అమర్ కోపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి అద్దె ఇంట్లో నివశిస్తుండగా ఆ ఇల్లు ఎఫ్.టీ.ఎల్ పరిధిలో ఉన్నట్టు తెలుస్తోంది. నెల రోజుల్లోగా అక్రమ కట్టడాలను కూల్చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం కొసమెరుపు.
 
దుర్గం చెరువును ఆనుకుని ఉన్న డాక్టర్స్ కాలనీ, నెక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు సైతం అధికారులు ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. నా కుటుంబం కబ్జా చేసినట్లు ప్రూవ్ చేస్తే నేనే దగ్గరుండి కూల్చివేయిస్తా అని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసిన కొన్ని గంటల్లోనే హైడ్రా అధికారులు తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు అంటించడం కొసమెరుపు.
 
అయితే ఈ ఇల్లు అద్దె ఇల్లు కావడంతో తిరుపతి రెడ్దికి ఎలాంటి నష్టం లేదనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. హైడ్రా అధికారులు ఒకింత దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కోర్టుల్లో సైతం పిటిషన్లు దాఖలవుతున్నాయి. తెలంగాణ సర్కార్ మాత్రం హైడ్రా వల్ల తమ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భావిస్తోంది. బీజేపీ నేతలలో కొంతమంది రేవంత్ రెడ్డి నిర్ణయాలను ప్రశంసిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఒకింత సంచలనం అయిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: