బీఆర్ఎస్ వార‌స‌త్వ పోరు: కేసీఆర్ కు హ‌రీష్‌ రావు వెన్నుపోటు పొడుస్తాడా ?

frame బీఆర్ఎస్ వార‌స‌త్వ పోరు: కేసీఆర్ కు హ‌రీష్‌ రావు వెన్నుపోటు పొడుస్తాడా ?

Veldandi Saikiran
* టిఆర్ఎస్ లో కేటీఆర్ కంటే హరీష్ రావుకు ఎక్కువ ఫాలోయింగ్
* మాస్ లీడర్ గా హరీష్, క్లాస్ లీడర్ గా కేటీఆర్  కు గుర్తింపు
* కెసిఆర్ కొడుకుగా కేటీఆర్ కు ఎక్కువ ప్రాధాన్యత
* హరీష్ రావు కే బాధ్యతలు ఇవ్వాలని క్యాడర్  డిమాండ్
 తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన గులాబీ పార్టీ పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైంది. 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన గులాబీ పార్టీ... ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడం ఇటు పార్లమెంటు ఎన్నికల్లో జీరోకు పడిపోవడంతో  ఆ పార్టీకి కొత్త నాయకున్ని పెట్టాలని  క్యాడర్ డిమాండ్ చేస్తోంది.
 వాస్తవంగా మొన్నటి ఎన్నికల్లో కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు ఉద్యమ పార్టీ. అయితే కేటీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీకి ఘోర పరాజయాలు  ఎదురయ్యాయి. కేటీఆర్ కు మాస్ కంటే క్లాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరూ లీడర్లు కేటీఆర్ ను కలుపుకోలేకపోతున్నారు.  ఆయనకు ఎలాంటి సమస్యలు చెప్పుకోలేకపోతున్నారు. అంతేకాదు హరీష్ రావుకు ఉన్నంత అనుభవం కేటీఆర్ కు లేదు.
 కెసిఆర్ కొడుకు అని కేటీఆర్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నప్పటికీ...  టిఆర్ఎస్ పార్టీలో నెంబర్ టు లీడర్గా హరీష్ రావే ఉంటారు. కెసిఆర్ ను మించిన లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ రావు అని చెప్పవచ్చు. ఇక టిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా ముందుండి నడిపిస్తాడు హరీష్ రావు.
తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లిన.. హరీష్ రావు  ను ప్రతి ఒక్కరు గుర్తుపట్టి ఆదరిస్తారు. అయితే... అల్లుడు కంటే కేటీఆర్ కె... కెసిఆర్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని ఓ వార్త కూడా ఉంది. దీంతో టిఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతుందని కొంతమంది చర్చిస్తున్నారు. వాస్తవానికి హరీష్ రావుకు టీఆర్ఎస్ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ మళ్లీ ఫామ్ లోకి వస్తుందని కొంతమంది చెబుతున్నారు. మరి దీనిపై కేసీఆర్ ఎలా ముందుకు వెళతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: