ఏపీకి కేంద్రం డబుల్ బొనాంజా.. ఏకంగా అన్ని వేల కోట్ల నిధులు కేటాయించిందా?
కేంద్ర మంత్రి వర్గం బుధవారం రోజున సమావేశమై కీలక నిర్ణయాలను తీసుకోగా ఈ నిర్ణయాలకు సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాకు వెల్లడించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను వెల్లడించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకు రూ. 12 వేల కోట్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన చెప్పుకొచ్చారు.
గతంలో నిర్మించిన నిర్మాణ సంస్థలకే పనులు అప్పగించేందుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వెనక్కి వెళ్లడానికి జగన్ కారణమని ఆయన నాయకత్వంలో మాత్రమే అన్నీ సాధ్యమవుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఒకే సమయంలో రెండు శుభవార్తలు చెప్పడం అంటే శుభ పరిణామం అనే చెప్పాలి.
డబుల్ ఇంజన్ గ్రోత్ ఓరియెంటెడ్ ప్రభుత్వం కారణంగా ఇది సాధ్యమైందని మంత్రి వెల్లడించడం కొసమెరుపు. వర్షాకాలం ముగిసిన వెంటనే పనులు మొదలుపెట్టాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు రామ్మోహన్ నాయుడు అన్నారు. రామ్మోహన్ నాయుడు వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. రామ్మోహన్ నాయుడు చెప్పిన విషయాలు సొషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పూర్తిస్థాయిలో జరిగేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం కొసమెరుపు.