జ‌న‌సేన ఫ‌స్ట్ హీరో అట్ట‌ర్‌ప్లాప్ పొలిటిక‌ల్ షో ...!

RAMAKRISHNA S.S.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయినా కూడా పవన్ కళ్యాణ్ కే లేని ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు ఒక నేత. ఆ నేత చేసిన తప్పులతో ఆయన పొలిటికల్ కెరీర్ మటాష్ అయిపోయింది. జనసేన లోనే తొలి ఎమ్మెల్యేగా రికార్డులకు ఎక్కారు రాజులు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. 2009లో కాంగ్రెస్ నుంచి తొలిసారి రాజోలు ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక ... 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డులకు ఎక్కారు. ఆ మాటగా వస్తే జనసేన నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే కూడా రాపాక వరప్రసాద్ రావు కావటం విశేషం.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెట్టిన జ‌న‌సేన పార్టీ భ‌విష్య‌త్తులో ఎన్నో రికార్డులు క్రియేట్ చేయ‌వ‌చ్చు.. కానీ ఆ పార్టీ నుంచి ఎంత మంది ఎంపీలు.. ఎమ్మెల్యేలు .. ఎమ్మెల్సీ లు అయినా కూడా కేవ‌లం తొలి ఎమ్మెల్యే ఎవ‌రు అంటే ముందుగా వినిపించే పేరు రాపాక వ‌ర‌ప్ర‌సాద రావు మాత్ర‌మే. జన‌సేన ఎమ్మెల్యే గా గెలిచి నా  అనంతరం వైసిపి చెంత చేరిన రాపాక పవన్ కళ్యాణ్ తో పాటు ... జనసేన పై విపరీతమైన విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు జగన్ షాక్ ఇచ్చారు. రాజోలు టికెట్ కాకుండా అమలాపురం ఎంపీ సీటు ఇవ్వగా చిత్తుచిత్తుగా ఓడిపోయారు.

ఒకవేళ రాపాక పార్టీ మారకుండా జనసేన లో ఉండి ఉంటే ఈసారి కూడా కూటమి పొత్తు నేపథ్యంలో రాజోలు నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించేవారు. అలాగే ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చి ఉండేది. రెండోసారి జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు సీనియార్టీ కోటాలో రాపాక వ‌ర ప్రసాద్ రావు మంత్రి అయి ఉండేవారు. ఇప్పుడు అమలాపురం ఎంపీగా ఓడిపోవడంతో రాపాక పొలిటికల్ కెరీర్ దాదాపు క్లోజ్ అయినట్టుగా చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: