ఏపీలో ఏడు కొత్త విమానాశ్రయాలు... ఎక్కడెక్కడో తెలుసా.. !
- ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- కొత్త విమానాశ్రయాలు పూర్తయితే ఏపీకి తిరుగులేని క్రేజ్ .. !
- ఏడు కొత్త విమానాశ్రయాలు వస్తే ఏపీ అభివృద్ధికి మంచి ఊతం .. !
- ( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) .
ఆంధ్రప్రదేశ్‌లో నూతన విమానాశ్రయాల ఏర్పాటు హడావుడి ఇప్పుడు బాగా కనిపిస్తోంది. ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికలలో శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా విజయం సాధించారు యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడు. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్ వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని.. ఎంపీ గా గెలిచిన రామ్మోహన్ నాయుడు.. ఈ ఎన్నికల లో వరుసగా మూడోసారి గెలిచి ఒక్కసారిగా ట్రెండ్ సెట్ చేశారు . అనుహ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీయే ప్రభుత్వం లో చేరడంతో తెలుగుదేశం రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కించుకుంది.
కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఎంపిక అయితే.. గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు అవకాశం దొరికింది. రామ్మోహన్ నాయుడుకు విమానాశ్రయ శాఖ మంత్రి అవకాశం రావడంతో.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు పై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు ప్రాంతాలలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటును పరిశీలిస్తున్నట్టు తాజాగా రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
శ్రీకాకుళం ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన అన్నవరంతోపాటు.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు కేంద్ర బిందువుగా ఉండి.. నిట్ సెంటర్ ఉన్న తాడేపల్లిగూడెం.. అటు నాగార్జునసాగర్.. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంతో పాటు.. ఒంగోలు, నెల్లూరు మధ్యలో మరో ఎయిర్ పోర్ట్... రాయలసీమలో అనంతపురంలో మరో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నామని.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.