మహారాష్ట్రలో ఓ హెలికాప్టర్ శనివారం రోజు కూలిపోయిన సంగతి తెలిసిందే. ముంబై నుంచి బయల్దేరిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ పుణెలోని పౌద్ సమీపంలో కూలింది. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదానికి ఏపీకి లింక్ పెడుతూ ప్రచారం జరిగింది. ఈ హెలికాప్టర్ ముంబై నుంచి విజయవాడ వస్తుండగా క్రాష్ అయ్యిందని.. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని కొందరు సోషల్ మీడియాలో ఫోటోలను వైరల్ చేశారు.నిన్నటి నుంచి కొన్ని మీడియా సంస్థలకు చెందిన నివేదికల మీద ఒక వార్త హడావుడి చేస్తోంది. దాని సారాంశాన్ని సింపుల్ గా ఒక్క లైన్ లో చెప్పాలంటే.. ‘ఏపీ సీఎం చంద్రబాబు కోసం ముంబయి నుంచి తెప్పిస్తున్న హెలికాఫ్టర్ క్రాష్ అయ్యింది’ అని. ఇందులో వాస్తవం ఎంతన్నది పక్కన పెడితే.. చంద్రబాబు కోసం తెప్పిస్తున్నారన్న మాటతో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. నిజంగానే చంద్రబాబు కోసం హడావుడిగా ఒక హెలికాఫ్టర్ ను తెప్పిస్తున్నారా? అన్నది మరో చర్చగా మారింది. అసలేం జరిగిందన్నది చూస్తే..ఈ హెలికాప్టర్ నెల రోజుల నుంచి మెయింటెన్స్‌లో ఉందని.. ఇప్పుడు ఆగమేఘాల మీద విజయవాడకు రప్పించే ప్రయత్నం చేశారని కొందరు ప్రచారం చేశారు. ఏపీలో ఏవియేషన్ కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహారావు ఒత్తిడితోనే హెలికాప్టర్‌ను ముంబై నుంచి విజయవాడకు తీసుకొస్తున్నట్లు కొందరు ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ఒత్తిడి చేసి హెలికాప్టర్‌ను రప్పించే యత్నాలు చేసినట్లుగా ఆరోపించారు.
అయితే చంద్రబాబు కోసం ఈ హెలికాప్టర్‌ను ముంబై నుంచి విజయవాడకు తీసుకొస్తున్నారనే ప్రచారంలో నిజం లేదంటున్నారు.
ఈ మేరకు కొందరు తెలుగు తమ్ముళ్లు మహారాష్ట్ర పోలీస్ అధికారి ఈ హెలికాప్టర్ ప్రమాదంపై మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు. ఆ ప్రచారాన్ని నమ్మొద్దు అంటున్నారు.ఈ ప్రచారంలో నమ్మలేని నిజం ఏమంటే.. చంద్రబాబు ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి. ఒక రాష్ట్ర సీఎం కోసం ప్రభుత్వ పరంగా హెలికాఫ్టర్ సిద్ధంగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక ప్రైవేటు హెలికాఫ్టర్ ను తెప్పించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని చాలా మంది ప్రస్తావిస్తున్నారు. ఇదే సమయంలో ఏవియేషన్ కో ఆర్డినేటింగ్ అధికారి హెలికాఫ్టర్ ను రప్పించే ప్రయత్నాలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా పూణే లో కూలిపోయిన హెలికాప్టర్ సీఎం చంద్రబాబుకు కేటాయించినదేనని తేలింది.ఆయన కోసమే ముంబై నుంచి రప్పిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో సీఎం భద్రతపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఏవియేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పదహారేళ్ల నాటి హెలికాఫ్టర్ ను కొనసాగించడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దాని సామర్ధ్యాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైనా ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో తేలాల్సి ఉంది.