ఏపీ సిఎం: కాపుల రిజర్వేషన్లపై గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని ఏళ్ళ నుంచి కాపులు సైతం తమ రిజర్వేషన్ల కోసం ఎన్నో రకాలుగా పోరాటాలు చేశారు.. కాపులకు టిడిపి కూటమికి కాస్త మంచి అనుబంధం ఉన్నది. ఇటీవలే జరిగిన ఎన్నికలలో  టిడిపి పార్టీ కూటానికి జై కొట్టారు. అలాగే రాయలసీమలోని బలిజ కుటుంబాలు కూడా కూటమికే ఓటు వేశాయి. అందుకు ముఖ్య కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనే చెప్పవచ్చు. మిగిలిన కులాలలోని వారు కూడా కూటమికి ఓటు వేయడంతో భారీ విజయాన్ని అందుకుంది.
గత కొన్ని ఏళ్లుగా కాపులు ఎటువైపుగా ఉంటే వారి విజయం తద్యం అనేగా  మారిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం మీద ఈసారి కూడా మళ్లీ ఆశలు పెట్టుకున్నారు కాపులు. ముఖ్యంగా మూడు దశాబ్దాలుగా కాపులకు తీరని ఒకే ఒక్క కోరిక ఉన్నది. అదేమిటంటే కాపుల రిజర్వేషన్. వీరిని బీసీలో చేర్చాలంటూ డిమాండ్ చేసినప్పటికీ అప్పట్లో ముద్రగడ పద్మనాభం కూడా చాలా ఆందోళన చేపట్టారు. ఈయన ప్రస్తుత వైసిపిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 1994 నుంచి కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమం చేపడుతూనే ఉన్నారు.

గతంలో 2014లో టిడిపి పార్టీ అధికారంలో చేపట్టినప్పుడు హామీ ఇచ్చిందని విషయాన్ని అడగక అప్పుడు నెరవేర్చలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాపుల రిజర్వేషన్ల కోరిక గురించి చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తారనే విధంగా భావిస్తున్నారు. ఒకవేళ బీసీ రిజర్వేషన్లు అంటే మళ్ళీ ఇబ్బందులలో పడవలసి వస్తుంది. కాబట్టి రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని కూడా సుప్రీంకోర్టు ఇటీవలే తెలియజేసింది. EWS కోటాలో కేంద్రం ఇచ్చిన 10%లో తమకు 5% ఇవ్వాలనే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన సీఎం చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నట్లు కూటమి వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఉన్నప్పుడే ఈ కోటాలో కాపులకు 5% శాతం జీవోని ఇచ్చినప్పటికీ అది చల్లని జీవోగా మిగిలిపోయింది. మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: