నాడు రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. ఇప్పుడు కట్టకట్టుకుని ఏం చేశారో చూడండి..!
- ( నెల్లూరు - ఇండియా హెరాల్డ్ ) .
వైసిపి ఆవిర్భావం నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తుంది. ఉదయగిరి - కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలతో పాటు ... నెల్లూరు పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలోను వైసిపి భారీ మెజార్టీతో ఘనవిజయాలు సాధించింది. 2014 ఎన్నికలలో రాష్ట్రంలో వైసిపి ప్రతిపక్షంలో ఉన్నా కూడా నెల్లూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ ... నెల్లూరు పార్లమెంటు స్థానం గెలిచింది. 2019లో జిల్లా మొత్తం పది అసెంబ్లీ ... నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని స్వీప్ చేసింది. అలాంటి కంచుకోటలో ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో మొత్తం పదికి పది అసెంబ్లీ స్థానాలతో పాటు ... నెల్లూరు పార్లమెంటు స్థానంలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. నెల్లూరులో వైసీపీకి బలమైన నేతలు ఉండేవారు.
మేకపాటి - ఆనం - అనిల్ కుమార్ - కాకాని - వేమిరెడ్డి ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ సీనియర్లు ఉండేవారు. అయితే జగన్ రాజకీయాలతో వారు ఒక్కొక్కరు దూరమయ్యారు. జగన్ మోనార్క్ గా వ్యవహరించి పార్టీని నాశనం చేసినా కొందరు పార్టీని వీడి పోతే.. మరి కొందరు మాత్రం అక్కడే ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉండి ఇష్టం వచ్చినట్టు హడావుడి చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ ఎక్కడ ? రాజకీయం చేయాలో ఇంకా హైకమాండ్ క్లారిటీ ఇవ్వలేదు. ఆయన తిరిగి నెల్లూరు సిటీకి పంపుతారా లేదో తెలియదు. లేదా నరసరావుపేటలో ఉండమంటారా అన్నది అర్థంకాక తలలు పట్టుకుంటున్న పరిస్థితి.
వేమిరెడ్డి - ఆనం టిడిపిలో చేరిపోయారు. మేకపాటి కుటుంబం పూర్తిగా డిటాచ్ అయిపోతుంది. విక్రమ్ రెడ్డి - మేకపాటి వరసత్వాన్ని నిలబెట్టే మనిషి కాదు.. కుటుంబంలో చేరికలు వచ్చేసాయి. కాకాణి - గోవర్ధన్ రెడ్డికి బయట అడుగు పెట్టాలంటే కేసులు భయం వెంటాడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అరుపులు అరిచిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఏది ఏమైనా నాడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు కట్టకట్టుకుని సైలెంట్ అయిపోయారు.