సోషల్ మీడియాను దున్నేస్తున్న కేటీఆర్.. కష్టం వస్తే చాలు అన్ని తానై నిలుస్తాడు ?
* కరోనా సమయంలో సోషల్ మీడియా ద్వారా చాలామందికి సహాయం
* చిన్న సమస్యకు కూడా సోషల్ మీడియా ద్వారానే సమాధానం
* జనాల్లోనూ మంచి ఆదరణ
* ఓటమి ఎరుగని నాయకుడు
ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా... సోషల్ మీడియా హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియా హవా ఉన్న నేపథ్యంలో... రాజకీయ నాయకులకు కూడా... వాటిని బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. అలాంటి వారిలో మాజీ మంత్రి, గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒకరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. ప్రజల సమస్యలు తీరుస్తూ ఉంటారు కేటీఆర్.
ఈ తరుణంలోనే సోషల్ మీడియా స్టార్ అనే పేరు కూడా కేటీఆర్ కు వచ్చింది. ఇక.. గులాబీ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు... ఏ చిన్న సమస్య వచ్చినా చాలామంది కేటీఆర్ కు ట్యాగ్ చేసి పోస్టులు పెట్టేవారు. అయితే సోషల్ మీడియాలో విపరీతంగా కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో... సోషల్ మీడియా పైన బాగా ఫోకస్ చేశారు కేటీఆర్. పేద లేదా ధనిక అనే తేడా లేకుండా ఎవరు పోస్ట్ పెట్టిన వెంటనే స్పందించడం మొదలుపెట్టారు.
అలా కరోనా టైం లో... తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నారు కేటీఆర్. ఆయన నేరుగా ప్రజల వద్దకు రాకుండా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టగానే స్పందిస్తారు. కరోనా సమయంలో... చాలామంది నిరుపేదలకు ఒక్క పోస్టు ద్వారా సహాయం చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అంతేకాదు గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న తెలుగు కార్మికులను కూడా చాలాసార్లు కాపాడారు.
ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంకు చెందిన కొంతమంది గల్ఫ్ లో జైలు పాలు అయితే... సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు అందడంతో వెంటనే స్పందించారు కేటీఆర్. వారిని విదేశాల నుంచి తీసుకువచ్చి... బంగారు భవిష్యత్తు చూపించారు. ఇక ప్రతిపక్షాలపై దాడులు చేయాలన్నా కూడా సోషల్ మీడియానే ఎంచుకున్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైనా.. మిస్టేక్స్ చేస్తే చాలు వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేస్తున్నారు కేటీఆర్. హలో కేటీఆర్ తన హవాను స్పష్టంగా చూపిస్తున్నారు.