వైసీపీ మామను వదలనంటోన్న టీడీపీ ఎమ్మెల్యే అల్లుడు..?
అప్పుడు మంత్రిగా కూడా ఆయన పని చేశారు. రాజకీయంగా సీనియర్ గా ఉన్న తమ్మినేని ఇప్పుడు వైసీపీలో ఉంటే రవికుమార్ టిడిపిలో ఉండి రాటు తేలారు. ఇటీవల ఎన్నికలలో ఆముదాలవలస నుంచి మామను ఓడించి మంచి మెజార్టీతో రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు రవికుమార్. ఇప్పుడు తమ్మినేని అక్రమాల చిట్టాను బయటికి తీసే పనిలో ఉన్నారు. తమ్మినేని మీద సమగ్ర దర్యాప్తు కోసం స్పెషల్ టీం ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు రవికుమార్ చెప్పటం గమనార్హం. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లు అని.. అంతేకాకుండా ఆస్తులకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించిన గొప్పతనం తమ్మినేనిదే అని రవికుమార్ చెపుతున్నారు.
17 ఆస్తుల విషయంలో తమ్మినేని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారని.. ఆ లెక్కలు అన్ని తేల్చే పనులు ప్రభుత్వం ఉందని రవికుమార్ చెబుతున్నారు. తమ్మినేని అక్రమాల చట్ట అంతా తన వద్ద ఉందని ఆయన మీద పూర్తి విచారణ చేసి నిగ్గు తేల్చేందుకు తమ అంత సిద్ధంగా ఉన్నామని రవికుమార్ ప్రకటించారు. ఏదిఏమైనా తమ్మినేని వర్సెస్ రవికుమార్ గా సాగుతున్న ఆముదాలవలస రాజకీయంలో మంచి రసవత్తరంగా మారింది. రాజకీయంగా నాలుగున్నర దశాబ్దాలుగా ఎన్నో ఢక్కా ముక్కలు తిన్న మామ ఒకవైపు ... దూకుడు రాజకీయాల్లో తనకు ఎవరూ సాటిలేరని పేరు తెచ్చుకున్న.. అల్లుడు రవికుమార్ మరోవైపు ఉండడంతో ఈ రాజకీయం మామూలుగా లేదు.