లోన్ లక్షన్నర మాఫీ అయింది రూ.83 .. తెలంగాణ రుణమాఫీలో ఇన్ని ట్విస్టులా?

Reddy P Rajasekhar
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలలో రుణమాఫీ స్కీమ్ ఒకటి. రుణమాఫీ స్కీమ్ వల్ల రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది. అయితే అన్ని అర్హతలు ఉన్నా తమకు రుణమాఫీ కాలేదంటూ చాలామంది రైతులు నిరసన వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. చాలామంది అన్నదాతలు రోడ్డెక్కడం హాట్ టాపిక్ అవుతోంది.
 
ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొంతమంది రైతులు కొంతమంది రైతులు ఆందోళనలు చేయడంతో పాటు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతమంది రైతులు రహదారులపై రాకపోకలను అడ్డుకోవడం కొసమెరుపు. అదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేయడం నెట్టింట కొత్త చర్చకు దారి తీస్తోంది.
 
కొంతమంది రైతులు సీఎం దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. జైనత్ మండలం రైతులు ఏకంగా బ్యాక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకుకు తాళం వేయడం ద్వారా నిరసన తెలియజేయడం కొసమెరుపు. తిమ్మాపూర్ కు చెందిన ఒక రైతుకు కేవలం 83 రూపాయలు కావడం గమనార్హం. కరీంనగర్ జిల్లాకు చెందిన వేల్పుల మల్లయ్య అనే రైతు లక్షన్నర రూపాయల రుణం తీసుకుంటే కేవలం 83 రూపాయలు మాత్రమే మాఫీ అయింది.
 
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రైతు గత డిసెంబర్ లో రుణం తీసుకోగా తన రుణం మాఫీ అవుతుందని భావించిన రైతు చివరకు షాక్ తగిలింది. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం సదరు రైతుకు బ్యాంక్ స్టేట్మెంట్ తో తమను సంప్రదించాలని కోరడం కొసమెరుపు. అర్హతలు ఉన్న రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  రుణమాఫీ అమలు ఎంతో కష్టం కాబట్టే చాలా రాష్ట్రాలు ఆ హామీ అమలు దిశగా అడుగులు వేయడానికి ఇష్టపడటం లేదని సమాచారం అందుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: