ఆ రోజుల్లోనే మాధవి 15 ఎకరాల కట్నం తెచ్చిందా.. లవ్ స్టోరీ లో ఎన్ని ట్విస్టులంటే.?

Pandrala Sravanthi
- ఇంట్లో ఇల్లాలు చదివితే ఇల్లంతా బాగే.!
- రామచంద్రరావుకి అదృష్టమే మాధవి.
- కులాంతర వివాహమే కలిసివచ్చిందా.?


 మన ఇండియాలో ఎక్కువగా కుల పిచ్చి అనేది ఉంటుంది. సాధారణంగా ఏ కులంలోని వారు ఆ కులంలోని అమ్మాయిలను మాత్రమే వివాహాలు చేసుకుంటారు.  కానీ ప్రస్తుత కాలంలో ఆ వ్యవస్థ మారుతుంది. కులాల పట్టింపు లేకుండా ప్రేమ వివాహాలు కూడా చేసుకుని ఆనందంగా జీవిస్తున్నారు. అలా ప్రేమ వివాహం చేసుకున్న వారిలో  గల్లా మాధవి రామచంద్రరావు కూడా ఒకరు. కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి రామచంద్రారావు, రజక సామాజిక వర్గానికి చెందినటువంటి పిడుగురాళ్ల మాధవిని ప్రేమ వివాహం చేసుకున్నారు. మరి వీరి లవ్ స్టోరీ ఎలా సాగింది. అసలు పిడుగురాళ్ల మాధవి  బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే వివరాలు చూద్దాం..

 రామచంద్ర రావు మాధవి:
 గల్లా మాధవి 1984 సంవత్సరంలో పిడుగురాళ్ల శివయ్య శివకుమారి దంపతులకు జన్మించింది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి.  చిన్నప్పటినుంచి తన తండ్రి యొక్క భక్తిశ్రద్ధలతో పెరిగిన మాధవి, నలుగురికి సహాయపడే  తత్వాన్ని చిన్నతనం నుంచి అలవాటు చేసుకుంది. ఎంసీఏ పట్టభద్రురాలైన గల్లా మాధవి ప్రిలిమ్స్ లో కూడా ఉత్తీర్ణురాలు అయింది. అలాంటి గల్లా మాధవి గల్లా రామచంద్రరావుతో లవ్ లో పడి 2005లో వివాహం చేసుకున్నారు. ఈ రెండు కుటుంబాలు ఉన్నతమైన విలువలు కలిగినవి కావడంతో సేవ చేయాలనే గుణంతో భ్రమరా ట్రస్ట్ స్థాపించి దానికి డైరెక్టర్ గా మాధవిని ఉంచారు. ఈ ట్రస్ట్ తరఫున ఎంతోమందికి ఉద్యోగ కల్పన కల్పిస్తూ సేవలు చేస్తూ వస్తున్నారు.

 
 రామచంద్రరావుతో పెళ్లికి ఒప్పుకొని మాధవి ఫ్యామిలీ:
పిడుగురాళ్ల మాధవి రజక సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి, రామచంద్రరావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. వీరి పెళ్లి సమయంలోనే రామచంద్రరావు ఫ్యామిలీకి 15 ఎకరాలకు పైగా కట్నంగా మాధవి ఫ్యామిలీ అందించిందట. అప్పటికి రామచంద్రరావు ఫ్యామిలీ మాధవి ఫ్యామిలీ కంటే ఆర్థికంగా వెనుకబడిపోయి ఉన్నవారే. ఎప్పుడైతే మాధవి కట్నంగా 15 ఎకరాల ల్యాండ్ అందిందో అప్పటినుంచి రామచంద్రరావు కొద్దికొద్దిగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. హాస్పిటల్ పెట్టి విపరీతంగా సంపాదించారు. ముందుగా మాధవి ఫ్యామిలీ రామచంద్రరావు తో పెళ్లి అంటే అస్సలు ఒప్పుకోలేదట. దీన్నిబట్టి చూస్తే మాధవి ఫ్యామిలీ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఈసారి ఎన్నికల్లో అన్ని సామాజిక సమీకరణాలు కలిసి రావడంతో మాధవికి టిడిపి టికెట్ అందించింది. ఈమె మాజీ మంత్రి విడదల రజినీపై అద్భుత మెజారిటీతో గెలుపొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: