రాజకీయాల్లో ఆ రికార్డ్ సాధించిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్.. మ్యాజిక్ రిపీట్ చేయలేరుగా!

Reddy P Rajasekhar
సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ల గురించి రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. సినిమాల్లో సక్సెస్ సాధించిన వాళ్లంతా రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తారా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తుంది. అయితే సీనియర్ ఎన్టీఆర్ మాత్రం సినీ గ్లామర్ తో రాజకీయాలలో సంచలనాలు సృష్టించి వార్తల్లో నిలిచారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ రికార్డ్ సాధించిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్ అని చెప్పవచ్చు.
 
ఇలా రాజకీయాల్లో సంచలనాలను సృష్టించడం సీనియర్ ఎన్టీఆర్ మినహా మరెవరికీ సాధ్యం కాదని భవిష్యత్తులో కూడా సాధ్యం అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ప్రజల నమ్మకాన్ని చూరగని తన గెలుపుతో పొలిటికల్ లెక్కలను మార్చేశారు. రాజకీయ ప్రయాణంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని సులువుగా అధిగమిస్తూ ప్రశంసలు అందుకున్నారు.
 
వాస్తవానికి సీనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న సమయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వరుస విజయాలు అందుకుంటున్న సీనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాలు అవసరమా అని కామెంట్లు చేసిన వాళ్లు సైతం ఉన్నారు. అయితే అలా విమర్శలు చేసిన వాళ్ల నోర్లను సీనియర్ ఎన్టీఆర్ పార్టీ గెలుపుతో మూయించారు. అప్పట్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన వాళ్లు సైతం పెద్దగా గుర్తింపు లేని వాళ్లే కావడం గమనార్హం.
 
సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినిమాల్లో నటించినా ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో అయితే నటించలేదని సంగతి తెలిసిందే. చాలామంది సినీ నటులు రాజకీయాలపై ఆసక్తి చూపించడానికి ఒక విధంగా సీనియర్ ఎన్టీఆర్ కారణమని చెప్పవచ్చు. ఎన్టీఆర్ పేదల పక్షపాతి అని ఆయన భౌతికంగా మరణించినా అమలు చేసిన పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ జీవించి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ లాంటి మహానేతకు ఎవరూ సాటిరారని కొన్ని కఠిన నిర్ణయాలను సైతం అమలు చేసి ప్రశంసలు అందుకున్న ఘనత ఆయనకే సొంతమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: