విజయశాంతి : సినిమా గ్లామర్ తో 25 ఏళ్లుగా రాజకీయాలను ఏలుతున్న రాములమ్మ ?

frame విజయశాంతి : సినిమా గ్లామర్ తో 25 ఏళ్లుగా రాజకీయాలను ఏలుతున్న రాములమ్మ ?

Veldandi Saikiran

*  సినిమాలో హీరోయిన్ గా రాణింపు
* 25 ఏళ్లుగా రాజకీయాల్లో విజయశాంతి
* తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
* కెసిఆర్ తో మంచి సంబంధాలు

సినిమా పరిశ్రమకు అలాగే రాజకీయ రంగానికి.. అభినవభవ సంబంధం ఉంది. చాలామంది సినిమా సెలబ్రిటీలు రాజకీయాల్లోకి  వచ్చి సక్సెస్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు అలాగే హీరోలు కూడా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి దూసుకు వెళ్లారు.ఇంకా కూడా చాలామంది సెలబ్రిటీలు రాజకీయాల్లోకి వస్తున్నారు.అయితే...టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి... రాజకీయాల్లో సక్సెస్ అయిన వారు విజయశాంతి ఒకరు.
 

తెలంగాణ రాష్ట్రానికి చెందిన విజయశాంతి... అనేక పోరాటాలు చేసి రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం... వీరనారిలా  పోరాటం చేశారు విజయశాంతి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలయ్య లాంటి ఎంతో మంది స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి... ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.  1998 ఆ సమయంలో... రాజకీయాల్లోకి బిజెపి పార్టీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు రాములమ్మ.
 

ఆ సమయంలో నరేంద్ర నాయకత్వంలో పనిచేసే సక్సెస్ అయ్యారు. అయితే బిజెపి పార్టీతో తెలంగాణ వచ్చేలా లేదని తల్లి తెలంగాణ అనే పార్టీని కూడా రాములమ్మ స్థాపించారు. ఈ పార్టీని 2005 సమయంలో స్థాపించిన రాములమ్మ... ఆ పార్టీ ద్వారా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అయితే అదే సమయంలో గులాబీ పార్టీ చెంతకు చేరారు విజయశాంతి. గులాబీ పార్టీలో చేరిన తర్వాత విజయశాంతి కెరీర్ పూర్తిగా మారిపోయింది.

ఆమె గులాబీ పార్టీలోకి వెళ్లిన తర్వాత చాలా సార్లు మెదక్ ఎంపీగా విజయం సాధించారు.అలాగే కేసీఆర్ వెంట నడిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేశారు.కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కాంగ్రెస్లో చేరిపోయారు రాములమ్మ. అనంతరం కాంగ్రెస్ నుంచి బిజెపికి.. మళ్లీ ఇప్పుడు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. ఇప్పటికీ మళ్ళీ గులాబీ పార్టీని సపోర్ట్ చేస్తూ రామలమ్మ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: