పవర్ స్టార్ పవన్ పరువు తీసేసిన ట్రోల్స్ ఇవే.. చదువు విషయంలో విమర్శలు తప్పలేదుగా!

Reddy P Rajasekhar
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియాలో మైండ్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలు సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పవన్ ప్రధానంగా పలు సందర్భాల్లో తాను చేసిన కామెంట్స్ ద్వారా ట్రోల్స్ కు గురయ్యారు. ఇంటర్ సీఈసీ చదివానని ఒక సందర్భంలో ఎం.ఈ.సీ తీసుకున్నానని మరో సందర్భంలో ఎంపీసీ తీసుకున్నానని మరో సందర్భంలో పవన్ పై ట్రోల్స్ వచ్చాయి.
 
అయితే పవన్ 2024 ఎన్నికల సమయంలో అఫిడవిట్ లో తాను పదో తరగతి మాత్రమే చదువుకున్నానని చెప్పుకొచ్చారు. టంగుటూరి ప్రకాశం కేసరి అని పవన్ కామెంట్ చేయడంపై కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పడంపై కూడా కొన్ని విమర్శలు వినిపించాయి. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో 10000 పుస్తకాలు కూడా చదవడం కష్టమని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
ఏపీలో గతంలో పదో తరగతి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఫెయిల్ కాగా ఆ సమయంలో పవన్ కళ్యాణ్ విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వాలని కోరడంపై విమర్శలు వినిపించాయి. పవన్ ఈ ఏడాది చెప్పులు వేసుకుని దీక్ష చేయడంపై కూడా కొన్ని నెగిటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయి. పవన్ వాలంటీర్లపై చేసిన కామెంట్స్ విషయంలో సైతం విమర్శలు వ్యక్తం కావడం కొసమెరుపు.
 
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇకపై ఈ తరహా విమర్శలు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లలో ఎప్పటినుంచి పాల్గొంటారనే ప్రశ్నలకు సంబంధించి జవాబులు దొరకాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కొత్త తరహా కథాంశాలను ఎంచుకుంటే ఆయన ఖాతాలో రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు చేరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పవన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: