చంద్రబాబు : 7 కేసుల పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!

Divya
గత ప్రభుత్వం టిడిపి అధినేత చంద్రబాబుపైన  ఏడు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.. ముఖ్యంగా స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును కూడా అరెస్టు చేయడంతో పాటు 50 రోజుల వరకు జైలులో కూడా చంద్రబాబు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా కేసులలో నిందితుడిగా చేర్చడం జరిగింది. అయితే ఈ కేసులను సిబిఐ కి సైతం అప్పగించాలని ఇటీవలే దాఖలు చేయడంతో హైకోర్టులో విచారణ జరగడం జరిగింది. దీంతో ఇరువు వర్గాల మధ్య కూడా పలు రకాల వాదనలు వినిపించాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు పైన ఉన్న కేసులు అన్నీ కూడా సిబిఐ అప్పగించాలని పిటిషన్ వేసి వాటిపైన అడ్వకేట్ జనరల్ దమ్ములపాటి శ్రీనివాస్ అభ్యంతరాన్ని తెలియజేశారు.

ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అందుకు తగ్గట్టుగా వాదనలను కూడా వినిపించడం జరిగింది. కేవలం చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నందువల్లే ఆయన కేసులను సైతం సీబీఐకు అప్పగించాలంటూ చెప్పడం సరికాదును కూడా వాదనలను తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఐదు కేసులను విచారణ పూర్తి చేసి చార్జి సీట్లు కూడా దాఖలు చేశామని ఈ విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఆయన. కేవలం రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసులను పరిశీలిస్తామని ప్రభుత్వం తెలిపిందని కూడా కోర్టుకు తెలియజేశారు.

ప్రభుత్వం పరిశీలిస్తామని అంతిమ నిర్ణయం పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీ హైకోర్టు సైతం ప్రశ్నించగా ఈ విచారణ అనార్ధపైన కౌంటర్లు దాఖలు చేయాలంటూ ఏజీని ఆదేశాలను జారీ చేసిందట అనంతరం ఈ కేసును మళ్లీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులు మాత్రం చంద్రబాబును ఇబ్బందులు గురి చేసేలా కనిపిస్తున్నాయి.. మరి ఈ ఐదేళ్లలో ఈ కేసుల పైన చంద్రబాబు నిర్దోషి అని తేలుతాయేమో  చూడాలి మరి. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఎన్నో రకాల బాధ్యతలను కూడా చేపడుతూ ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: