కర్నూలులో టీడీపీ మాజీ సర్పంచ్ దారుణ హత్య.. హత్యా రాజకీయాలు ఆగట్లేదుగా!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు పాలనకు ప్రజల్లో మంచి మార్కులు పడుతున్నా రాష్ట్రంలో హత్యా రాజకీయాలూ ఎక్కువగా జరుగుతున్నాయనే విమర్శలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. కర్నూలులో టీడీపీ మాజీ సర్పంచ్ దారుణ హత్య సంచలనం అవుతోంది. పత్తికొండ మండలం హోసూరులో జరిగిన ఈ ఘటన హాట్ టాపిక్ అవుతోంది. టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు.
 
శ్రీనివాసులు బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆయన కళ్లలో కారంపొడి చల్లి హత్య చేసినట్లు తెలుస్తోంది. హోసూరు గ్రామంలో టీడీపీకి భారీ మెజార్టీ రావడంలో శ్రీనివాసులు పాత్ర ఉండటంతో ఆయనను హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ హత్య గురించి నారా లోకేశ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. శ్రీనివాసులు హత్య వైసీపీ మూకల పనే అని నారా లోకేశ్ అన్నారు.
 
ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ తరపున క్రియాశీలకంగా పని చేయడం కక్ష సాధింపుతో శ్రీనివాసులుని హతమార్చారని నారా లోకేశ్ పేర్కొన్నారు. జగన్ కు ప్రజాక్షేత్రంలో తిరస్కారం ఎదురైనా ఆ పార్టీ నేతలు పాత పంథాను మార్చుకోవడం లేదని లోకేశ్ కామెంట్లు చేశారు. శ్రీనివాసులు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని లోకేశ్ చెప్పుకొచ్చారు.
 
హత్య చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఈ ఘటన గురించి స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. కేఈ శ్యాంబాబు ఈ ఘటన గురించి తెలిసి కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో ఈ కేసు విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో అయినా రాష్ట్రంలో ఈ పరిస్థితులు మారతాయేమో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: