ఏపీ సిఎం:వరలక్ష్మి వ్రతం రోజున మహిళలకు గుడ్ న్యూస్..?

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మహిళలకు ఏదైనా గుడ్ న్యూస్ ఎన్నికల ముందు చెప్పిందంటే.. ఒకటి ఫ్రీ బస్.. మరొకటి ప్రతినెల 1500 రూపాయలు.. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఫ్రీ బస్ అనేది ఈ నెలలోనే మొదట మొదలు పెడతామని చెప్పినప్పటికీ ఆ తర్వాత మరో రెండు నెలలు సమయాన్ని తీసుకుంటున్నామంటూ తెలియజేసింది కూటమి ప్రభుత్వం. అయితే ఈ పథకం పైన అటు వైసిపి పార్టీ క్వశ్చన్ చేస్తూ ఉండడంతో పాటు ప్రజలలో కూడా కూటమి పైన కాస్త అసహనం కనిపిస్తూ ఉండడంతో అమలు చేసేందుకు సన్నహాలు చేస్తున్నారట.

అంతేకాకుండా అటు కర్ణాటక, తెలంగాణ వంటి ప్రాంతాలలో కూడా ఈ పథకాన్ని అధికారం చేపట్టిన నెల రోజులకే అమలు చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు కాలేదు అంటు చాలా మంది విమర్శిస్తున్నారుట. అయితే అక్కడ వాటికి మన వాటికి చాలా తేడా ఉన్నది.. అక్కడ చాలా లాంగ్ బస్సులు ఉన్నవి. ఇక్కడ ఓన్లీ పల్లె వెలుగు బస్సులకు మాత్రమే అన్నట్టుగా తెలియజేస్తున్నారు. ఇందుకు సంబంధించి విధివిధానాల పైన కూడా కసరత్తులు చేస్తున్నట్లుగా కూటమి ప్రభుత్వం తెలియజేస్తోంది.

అది కూడా ఇవ్వాలో రేపు నిర్ణయాలను తీసుకునేలా ప్లాన్ చేస్తూ చేస్తున్నారట. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వరలక్ష్మి వ్రతం శుక్రవారం జరగబోతోంది. 16వ తారీఖున. ఆరోజుకి ఉచిత బస్సు అన్నటువంటిది మొదలుపెట్టాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించి అంశం కూడా చర్చనీ అంశంగా జరుగుతూ ఉన్నట్లు వార్త వినిపిస్తున్నాయి. మరి ఆ రోజు నుంచి ఫ్రీ బస్సు అనేది ఇస్తారా ఆరోజు అనౌన్స్మెంట్ చేసి.. రెండు నెలల తర్వాత ఉంచే అమలు చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉన్నది. అయితే కర్ణాటక తెలంగాణ వంటి ఇతర ప్రాంతాలలో అన్ని బస్సులకు కూడా మహిళలకు ఫ్రీగా అమలు చేశారు కానీ ఏపీలో పల్లె వెలుగులో మాత్రమే ఈ పథకం అమలులోకి రావడం మహిళలలో అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: