ఏపీ: కూటమితో బోత్స పోటి.. వైసీపీకి గెలుపునిచ్చేనా..?

frame ఏపీ: కూటమితో బోత్స పోటి.. వైసీపీకి గెలుపునిచ్చేనా..?

Divya
వైజాగ్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బొత్స సత్యనారాయణ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు.. ఇక కూటమి తరపు నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా బొత్స కు షాక్ ఇవ్వబోతోంది కూటమి ప్రభుత్వం అన్నట్లుగా వినిపిస్తోంది. ఆల్రెడీ వంశీకృష్ణ యాదవ్ చెప్పినట్టే.. చాలామంది తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్న నేపథ్యంలో 640 ఓట్లు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని.. 240 ఓట్లు ఉన్న కూటమి ప్రభుత్వం గెలుస్తుందా అనే విషయం ఇప్పుడు సందీప్తంగా మారింది.

ఎందుకంటే కూటమి ప్రభుత్వం పోటీ చేయాలని నిర్ణయించుకుంది.. చంద్రబాబు ఆదేశాల మేరకు ఒక కమిటీ వేసి జనసేన, బిజెపి ,టిడిపి నేతలు కలిపి వేసుకున్న లెక్కల ప్రకారం గెలుస్తామని నమ్మకం క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ.. అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి ఎన్నికల లో ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. 2024 ఎన్నికలలో అనకాపల్లి టికెట్టుని ఆశించి బైరా దిలీప్ చక్రవర్తి.. అనకాపల్లి సీటు వచ్చేసరికి సీఎం రమేష్ ఇచ్చేసరికి బైరా దిలీప్ కూడా సపోర్ట్ చేశారట. దీంతో అక్కడ ఆయన గెలుపు కూడా కాస్త సులువు అయిందని సమాచారం.

ఈనెల 30 వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు కన్ఫామ్.. వైసీపీ అభ్యర్థిగా  బొత్స సత్యనారాయణ నామినేషన్ వేస్తున్నారట. రెండవది బైరా దిలీప్ కు నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ ఉపసంహరణ డేట్ కూడా ముగిశాక.. 30వ తారీఖున ఎన్నికలు జరగబోతోంది. ఎన్నికలు ఆపే ప్రసక్తే లేదనే విధంగా వార్తలు వినిపిస్తోంది. వైసిపి పార్టీ కూడా అంతే ధీమాతో ఉంటున్నారు. అధికారం తమ చేతిలో ఉంది కాబట్టి కూటమి వైపుగా ఓటు ఎక్కువగా వేస్తారని నమ్మకం అటు కూటమి పార్టీకి కూడా ఉన్నది.. మరి ఇలాంటి సందర్భంలో ఎవరు గెలుస్తారన్న విషయం తెలియాలి అంటే కొద్ది రోజులు ఉండాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: