తె(లు)గులు మీడియా: జగన్ ఆత్మలాగా మారిన "సాక్షి" ?
* వైస్ భారతి చేతిలో సాక్షి
* బ్లూ మీడియాగా సాక్షిపై విమర్శలు
* వైసీపీ వార్తలు తప్ప.. మిగతావి పట్టించుకోని వైనం
రెండు తెలుగు రాష్ట్రాలలో... అనేక రకాల మీడియాలు ఉన్నాయి. అందులో ఎల్లో మీడియా అని.. కొంతమంది బ్లూ మీడియా అని... విభజన చేస్తూ ఉంటారు. ఎల్లో మీడియా అనేది.. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని రాజ కీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇటు బ్లూ మీడియా అనేది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న మీడియాని అంటూ ఉంటారు.
అటు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్ని చానల్స్ ఉన్నాయో..ఇటు జగన్మోహన్ రెడ్డి కి కూడా చాలా అను కూలమైన ఛానల్ ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా జగన్ గో ప్రత్యేకంగా సాక్షి ఛానల్... ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సాక్షి ఛానల్ బాధ్యతలను మొత్తం వైయస్ భారతి వ్యవహరిస్తుంటారని సమాచారం.
ఇక ఈ సాక్షి ఛానల్ లో.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా... వార్తలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అలాగే ప్రజలు కూడా చెబుతూ ఉంటారు. పొద్దున లేస్తే... చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగానే ఇందులో వార్తలు వస్తాయని... ఏపీ ప్రజల స్థానం చెబుతూ ఉంటారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు.. సాక్షి న్యూస్ పేపర్ ను... ప్రతి వాలంటీర్ చదివేలా... నిధులు కూడా విడుదల చేశారట జగన్.
న్యూస్ పేపర్ బిల్లులో భాగంగా... అందరూ సాక్షి పేపర్ చదివేలా చర్యలు తీసుకున్నారట. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నేత.. తప్పిదాలు చేస్తే సాక్షి ఛానల్ లేదా న్యూస్ పేపర్ లో బ్రేకింగ్ ల మీద బ్రేకింగ్ లో వార్తలు వచ్చేవట. ఈ విషయాన్ని ఏపీ ప్రజలు అలాగే రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు.