దువ్వాడ శ్రీనివాస్ అలా చేస్తే బెటర్.. తప్పులు రిపీట్ చేస్తే కెరీర్ ముగిసినట్టేనా?

frame దువ్వాడ శ్రీనివాస్ అలా చేస్తే బెటర్.. తప్పులు రిపీట్ చేస్తే కెరీర్ ముగిసినట్టేనా?

Reddy P Rajasekhar
ఏపీ రాజకీయాల గురించి అవగాహన ఉన్నవాళ్లకు దువ్వాడ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2021 మార్చిలో ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎన్నిక కావడం జరిగింది. బీఎల్‌ చేసి లాయర్ పట్టా అందుకున్న దువ్వడ శ్రీనివాస్ ఊహించని వివాదాల ద్వారా వార్తల్లో నిలిచి నెట్టింట సంచలనం అయ్యారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
దువ్వాడ శ్రీనివాస్ చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినా మెజారిటీ సందర్భాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం గమనార్హం. దువ్వాడ శ్రీనివాస్ తన కుటుంబ సమస్యను ఈ విధంగా మీడియాలో పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దువ్వాడ శ్రీనివాస్ మాధురితో రిలేషన్ ఉందనే విధంగా చేసిన కామెంట్లపై సైతం సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం వేళ దివ్వెల మాధురికి రోడ్డు ప్రమాదం జరగడం సంచలనం అయిన సంగతి తెలిసిందే. అయితే తానే కావాలని కారును గుద్దానని మాధురి చెబుతున్నారు. తనపై, తన పిల్లలపై ట్రోల్స్‌ను తట్టుకోలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని దివ్వెల మాధురి వెల్లడించడం కొసమెరుపు. వాణి ఆరోపణలను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవద్దని డాక్టర్లు నాకు చికిత్స అందించవద్దని మాధురి కామెంట్లు చేశారు.
 
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చెలరేగిన వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న దివ్వెల మాధురి భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. దువ్వడ శ్రీనివాస్ పొలిటికల్ కెరీర్ ను నాశనం చేసే దిశగా అడుగులు వేస్తే మాత్రం తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ కామెంట్లు వైసీపీ పరువును తీస్తున్నాయని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. దువ్వాడ వివాదం విషయంలో వైసీపీ నేతలు సైతం సైలెంట్ గా ఉన్నారని సమాచారం అందుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: