ఆళ్ల నాని అవుట్.. వైసీపీ లేడీ లీడర్‌కు లైన్ క్లీయర్ .. !
ఆళ్ల నాని వైసీపీని వీడి వెళ్లడంతో ఇప్పుడు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ పగ్గాలు ఎవరికి ? ఇస్తారు అన్న చర్చ వైసీపీలో నడుస్తోంది.
మధ్యలో ఒకసారి ఆళ్ల నాని ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు గతంలో ఏలూరుకు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గా పని చేసిన మధ్యాహ్నపు ఈశ్వరీ బలరాంకు నియోజకవర్గ కో - ఆర్డినేటర్ పగ్గాలు ఇచ్చారు. అయితే ఎన్నికలకు ముందు ఆమెను తప్పించి తిరిగి ఆళ్ల నానికే సీటు ఇచ్చారు. ఇక ఇప్పుడు నాని పార్టీని వీడడంతో ఏలూరు ఇన్చార్జి పగ్గాలు బీసీ కోటాలో పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి యాదవ కు కేటాయిస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి శ్రీలక్ష్మి యాదవ్ 2019 ఎన్నికలలో దెందులూరు సీటు ఆశించారు .. అయితే ఆమెకు అప్పుడు ఆ సీటు దక్కలేదు. జగన్ తనకు సన్నిహితుడైన ఎన్నారై కొఠారు అబ్బయ్య చౌదరికి సీటు ఇవ్వడంతో శ్రీలక్ష్మి యాదవ్ ఆశలు నెరవేరలేదు. ప్రస్తుతం ఆళ్ల నాని తప్పుకోవడంతో పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి యాదవ్ కు అసెంబ్లీ సీటు ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది.