బెజవాడ కార్పొరేషన్ పై బాబు కన్ను..వైసీపీ టచ్ చేసే దమ్ము లేదా?
తాజా పరిణామాలను చూస్తుంటే బెజవాడకు కార్పొరేషన్ లో దాదాపు 15 మందికిపైగా కార్పొరేటర్లు కూటమి గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. బెజవాడ వెస్ట్ నుంచి ఎక్కువ మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారు. తాజాగా ఏడుగురు కార్పొరేటర్లు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితో భేటీ అయ్యారు. వీరి భేటీతో బెజవాడ రాజకీయాల్లో తెర వెనక మంతనాలు చర్చనీయంగా మారాయి.
బెజవాడ సిటీలోని మిగిలిన నియోజకవర్గంలోని వైసీపీ కార్పొరేటర్లు కూడా కూటమి పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చేనేతల ద్వారా మంతనాలు జరుపుతున్నారు. దీంతో అప్రమత్తమైన వైసీపీ నాయకత్వం గోడలు దూకేందుకు సిద్ధమవుతున్న కార్పొరేటర్లతో చర్చలు జరుపుతూ తొందరపడవద్దని, కార్పొరేటర్లతో బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు వైసీపీ నాయకత్వం. కార్పొరేషన్ ఎన్నికలకు ఏడాదిన్నరపైనే సమయం ఉండడంతో కార్పొరేటర్ల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే సేమ్ టైమ్ తొందరపడడం లేదు కూటమి ప్రభుత్వం. చేరికల విషయంలో అంత దూకుడుగా వెళ్లడం లేదు.
పిలుపు వచ్చేవరకు కాస్త ఓపిక పట్టండి అని అందరికీ సంకేతాలు ఇస్తోంది. మెజార్టీ వైసీపీ కార్యకర్తలు వచ్చి చేరిన ఇప్పటికిప్పుడు మేయర్ మార్చే అవకాశం లేకపోవడంతో... ఆచితూచి అడుగులు వేస్తున్నాయి కూటమి పక్షాలు. కార్పొరేటర్ల పార్టీలో చేరికతో కూటమి బలం పెరుగుతుందే తప్ప... మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 2025 మార్చి వరకు వేచి చూడాల్సిందే. కార్పొరేటర్ల చేరికలో బల ప్రదర్శనకు ఉపయోగపడుతుంది తప్ప ఇప్పటికిప్పుడు కలిసి వచ్చింది ఏమీ లేదు.