ఇజ్రాయెల్‌ గూఢచారులు మరీ ఇంత దారుణమా?

frame ఇజ్రాయెల్‌ గూఢచారులు మరీ ఇంత దారుణమా?

Chakravarthi Kalyan
దేనికైనా భయం కూడా భయపడుతుందా అంటే ఇదే మొసాద్. అణువణువునా దేశ భక్తి.. ప్రతి కణంలో ప్రాణాలకు తెగించే ధైర్యం. ఇంకా చెప్పాలంటే.. దే విల్ మేక్ ది రూల్స్. దే విల్ బ్రేక్ ది రూల్స్. ఇలా వెళ్లాలి.. అలా వెళ్లాలి అంటూ ఏమీ లేదు. నియమాలు లేవు. నిబంధనలు అంత కంటే లేవు. ఎలాగైనా వెళ్తారు. చంపేస్తారు. దేశం కోసం దేశాలు దాటేసి.. రక్తపాతం సృష్టించే నిఘా సంస్థ.

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత.. ఈ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. మొసాద్ అనేది ఇజ్రాయెల్ గూఢాచార్య సంస్థ. దీని గురించి తలా ఒక్కరూ ఒక్కోలా చెబుతారు. దీని చరిత్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదే సమయంలో భయాన్ని పుట్టిస్తుంది. హిబ్రూ భాష లో మొసాద్ అంటే సంస్థ అని అర్థం. వాల్డ్ లోని శక్తిమంతమైన గూఢాచార్య సంస్థల్లో మొసాద్ ఒకటి.

ఇది ఆపరేషన్ చేపట్టిదంటే.. ఏ చిన్న ఆధారం కూడా దొరకదు. ఇప్పుడు అదే జరుగుతుంది. హమాస్ చీఫ్ హత్య వెనుక మొసాద్ అని చెప్పడమే తప్ప నిరూపించడానికి ఏ ఆధారాలు లేవు. ఏం చేసినా.. ఎలా చేసినా మొసాద్ ఎప్పుడు బహిరంగంగా ఒప్పుకోదు. తమ దేశ భద్రతకు భంగం వాటిల్లకుండా.. నష్టం కలిగించే వారిని మొసాద్ ఎక్కడ ఉన్నా వదిలిపెట్టదు.

1972లో మ్యూనిక్ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి వెళ్లిన 11 మంది ఇజ్రాయెల్ క్రీడాకారులను పాలస్తీనా అతివాదులు హత్య చేశారు. దీని మనసులో పెట్టుకున్న మొసాద్ చాలా ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకుంది. అలాగే ఇప్పుడు అక్టోబరులో ఇజ్రాయెల్ పై దాడి చేసిన హమాస్ తీవ్రవాదులను ఒక్కొక్కరని వెతికీ మరీ పట్టుకుంటుంది. వారి కుటుంబ సభ్యుల ఆధారాలను సేకరిస్తోంది. తద్వారా వారిపై ఒత్తిడి తెచ్చి వారిని లేపేస్తోంది. ఇప్పుడు ఏకంగా హమాస్ చీఫ్ నే లేపేసింది. ఇది మొసాద్ ప్లానింగ్ అంటే. దేశ భద్రతకు విఘాతం కలిగిస్తే ఎవర్నీ వదిలిపెట్టని మొసాద్ నుంచి మనం నేర్చుకోవాల్సిందిదే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: