బై బై పాలిటిక్స్: ఇక అంబటి ఆడంబరాలు కనిపించడం కష్టమేనా.?
- వైసిపి ఓటమితో సైలెంట్..
- పాలిటిక్స్ కు బై బై చెప్పనున్నారా.?
అంబటి రాంబాబు..ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో గుర్తింపు పొందిన నేత. ఈయన తన గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉంటూ, ప్రభుత్వానికి సంబంధించిన చాలా వ్యవహారాలు చూసుకునేవాడు. అలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక లీడర్ గా ఉండేటువంటి అంబటి రాంబాబు పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయారు. అంతేకాదు ఆయన పాలిటిక్స్ కి కూడా గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
రాజకీయ ప్రస్థానం :
అంబటి రాంబాబు కాంగ్రెస్ పార్టీ ద్వారా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 1988లో గుంటూరు జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ గా, 1994లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక చిన్న చిన్న పదవుల నుంచి 1989లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు అంబటి రాంబాబు.కానీ 1994, 1999లో జరిగినటువంటి ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలయ్యారు. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ఈ పార్టీలో అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. 2014లో వైసిపి నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్థి శివప్రసాద్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఇక 2019లో వైసీపీ నుంచి మరోసారి పోటీ చేసి 20 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సమయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.దీంతో అంబటి రాంబాబుకు కూడా జగన్ మంత్రివర్గంలో చోటు దక్కింది. అలా అంబటి రాంబాబు కొన్నేళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, 2024 ఎలక్షన్స్ లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో దారుణంగా ఓటమిపాలయ్యారు.
సీనియర్ నేత పాలిటిక్స్ కు బైబై:
ఏ రాజకీయ నాయకుడైనా ఏదో ఒక వయసులో పాలిటిక్స్ కు బై బై చెప్పాల్సిందే. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో వయసు కలిగినటువంటి నేతల్లో అంబటి రాంబాబు కూడా ఒకరు. ఇప్పడి వరకు ఆయన తన జీవితంలో ఎన్నో రాజకీయ పదవులు అనుభవించారు. ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులను ఆయన అలంకరించారు. అలాంటి రాంబాబు సత్తెనపల్లిలో ఓటమిపాలైన తర్వాత చాలా వరకు సైలెంట్ అయ్యారు. అయితే ఈయన ఎన్నికలకు ముందు తప్పకుండా వైసీపీ అధికారంలోకి వస్తుందని డబ్బా వాయించి మరీ చెప్పారు. ప్రతిపక్షాలకు హడలెత్తించారు. కానీ ఆయన మాటలు ఆయనకే తిరగబడ్డట్టు వైసిపి దారుణ ఓటమి పాలైంది. దీంతో అంబటి రాంబాబు సైలెంట్ అయిపోయారు. అలాగే పాలిటిక్స్ కి కూడా గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నారట. దీనికి ప్రధాన కారణం ఆయన వయసు మీద పడడం. ఇక రాజకీయాలు ఎదుర్కొనే అంత శక్తి కూడా లేకపోవడం. ఇక వైసిపి పార్టీ బ్రతికి బట్టగడుతుందా అనే అనుమానం కూడా ఆయనకు ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్ని అనుమానాల మధ్య ఆయన ఇక పాలిటిక్స్ లో ఉండడం బాగాలేదు అనుకుంటున్నారని తెలుస్తోంది. మరి చూడాలి ఆయన పాలిటిక్స్ కు బై బై చెప్తారా లేదంటే పార్టీ చేంజ్ అవుతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.