అప్పుడు హీరో ఇప్పుడు జీరో.. వరుస షాకులతో పెద్దిరెడ్డి హవాకు బ్రేకులు పడినట్లేనా?
ఈ ఎన్నికల్లో వైసీపీ మంత్రులందరూ ఓడిపోయినా పెద్దిరెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు పెద్దిరెడ్డి హీరో కాగా ఇప్పుడు ఆయన జీరో అయ్యారు. వరుస షాకులతో పెద్దిరెడ్డి హవాకు బ్రేకులు పడినట్లేనని తెలుస్తోంది. వయస్సు వల్ల ఆయన రాబోయే రోజుల్లో రాజకీయాల్లో విజయవంతంగా కెరీర్ ను కొనసాగించడం సైతం సులువైన విషయం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పుంగనూరులో ఇప్పటికే కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పుంగనూరు గడ్డ పెద్దిరెడ్డి అడ్డా అని గతంలో ప్రచారం జరగగా ఆ పరిస్థితి ఇప్పుడు మారింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వయస్సు 72 సంవత్సరాలు కాగా ఈ వయస్సులో యాక్టివ్ గా రాజకీయాలు చేయడం సులువైన విషయం కాదు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటన జరగగా ఈ ఘటనలో పెద్దిరెడ్డి పాత్ర ఉందని కూటమి నేతలు చెబుతున్నారు.
అయితే పెద్దిరెడ్డి మాత్రం సీబీఐ సహా ఏ దర్యాప్తుకైనా సిద్ధమంటూ ఛాలెంజ్ విసురుతుండటం కొసమెరుపు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యం కాక ఈ తరహా ఆరోపణలు చేస్తున్నాడని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్లు చేయడం గమనార్హం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి స్థాయి నేత దొరకడం వైసీపీకి సైతం సులువు కాదని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. 2029 ఎన్నికల్లో వైసీపీ తరపున పెద్దిరెడ్డి పోటీ చేసే అవకాశాలు సైతం దాదాపుగా లేనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.