వైసీపీలో అంతా ఖాళీ ఖాళీ.. ష్ గప్ చుప్..?
కానీ వంశీ మాత్రం పూర్తిగా అడ్రస్ లేకుండా పోయారు. చివరకు వంశీని పోలీసులు అరెస్టు చేస్తారని భయంతో ఆయన దేశం విడిచి వెళ్లిపోయినట్టు కూడా తెలుస్తోంది. అమెరికాలోని డల్లాస్ విధులలో వంశీ తిరుగుతున్న ఫోటోలు బయటకు వచ్చేసాయి. ఇప్పటికీ వంశీ అరెస్టు చేసేందుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఒకే ఒక్క ఓటమీ దెబ్బతో వంశీ లాంటి నేతలు భయం భయంగా ఉన్నారు. అంటే ఇక మిగిలిన నియోజకవర్గం నేతలు మాత్రం పార్టీని ఈ నాలుగేళ్లు ఎలా కాపాడుకుంటారు ? అన్నది వైసి పి వాళ్ళకి అర్థం కావటం లేదు. వంశి పార్టీ ఓడిపోయిన నెలరోజులకే అడ్రస్ లేకుండా పోయాడు.. అంటే ఈ ఐదేళ్లలో అసలు కనిపించరేమో ..! పూర్తిగా కాడి కింద పడేసి విదేశాల్లోనూ లేదా హైదరాబాదులో నో ఉంటారన్న చర్చలు కూడా వైసిపి వాళ్లలోనే వినిపిస్తున్నాయి.