ఆంధ్రప్రదేశ్ మందుబాబులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఏపీలో మందు ధరలు చాలావరకు దిగి రాబోతున్నాయి. మందు ధరలు దిగి రావడమే కాకుండా నాణ్యమైన అలాగే శ్రేష్టమైన మద్యాన్ని అందించేందుకు చంద్రబాబు సర్కారునిర్ణయం తీసుకోవడం జరిగింది. తాజాగా ఏపీ కేబినెట్ లో.. మందు బాబుల సమస్యల పైన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు చర్చించారట. ఈ విషయాలను మీడియా సమావేశంలో మంత్రి పార్థసారధి ప్రకటించడం జరిగింది.
ఇక ఏపీ కేబినెట్... నిర్ణయాల ప్రకారం... ఏపీ మంత్రి పార్థసారధి మాట్లాడుతూ... ఈసారి మందుబాబులకు శుభవార్త తీసుకువచ్చామని తెలిపారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ తీసుకురాబోతున్నట్లు... ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పార్థసారథి ప్రకటించారు. తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుంచి నాన్ డ్యూటీ లిక్కర్ అక్రమంగా... వచ్చిందని తెలిపారు. ఇదంతా వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిందని ఆరోపణలు చేశారు.
దీని ద్వారా 18 వేల కోట్ల నష్టం ఏపీ ప్రభుత్వానికి వచ్చిందని మంత్రి పార్థసారథి ఫైర్ అయ్యారు. ఇకపై... ఏపీలో అక్రమ మద్యం రవాణా జరగదని తెలిపారు. ముఖ్యంగా ఏపీ మందుబాబులకు... అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నాణ్యమైన మద్యాన్ని అమ్ముతామని.... మంత్రి పార్థసారథి ప్రకటించడం జరిగింది. నాణ్యమైన లిక్కర్ మద్యం అమ్మడమే కాకుండా... తక్కువ ధరకే... విక్రయాలు జరుపుతామని వెల్లడించారు.
ప్రజలకు అందుబాటులో ఉండేలా మద్యం ధరలు ఉంటాయని ప్రకటించారు. ఇకపై మద్యం తాగి... చనిపోయే వారి సంఖ్య... కచ్చితంగా తగ్గుతుందని... శరీరానికి హాని కలిగించే మద్యాన్ని అసలు అమ్మబో మని... వెల్లడించారు మంత్రి పార్థసారథి. పక్క రాష్ట్రాలకు వెళ్లి వైన్ బాటిల్స్... తీసుకో వచ్చే సంస్కృతి రూపుమాపుతామని తెలిపారు. అలాగే, ఏపీలో సహకార, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ముగ్గురు పిల్లలను ఉన్నా కూడా పోటీ చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు మంత్రి పార్థ సారథి. .