వైసీపీ ఖాళీ ఖాళీ : త్వరలో వైసీపీ పార్టీకి రోజా గుడ్ బై..? ఏకంగా ఆ స్టార్ హీరో పార్టీలోకి జంప్ ..?
* ఘోర ఓటమితో రాష్ట్రంలో వైసీపీ మనుగడపై భిన్నాభిప్రాయాలు
* జగన్ తప్పులను వేలెత్తి చూపిస్తున్న సొంత పార్టీ నేతలు
* ఇప్పటికే మొదలైన రాజకీయ వలసలు ..ఇదే కొనసాగితే త్వరలో వైసీపీ పార్టీ ఖాళీ
ఆంధ్రప్రదేశ్ లో 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలల్లో టీడీపీ ,బీజేపీ ,జనసేన కూటమి తిరుగులేని విజయం సాధించింది.గత ఎన్నికలలో 151 సీట్లు సాధించి సంచలనం సృష్టించిన వైసీపీ పార్టీ ఈ సారి కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ప్రతి పక్ష హోదా కోల్పోయింది.ఈ ఎన్నికల్లలో వైసీపీ ఇంతటి ఘోర ఓటమి చెందడానికి ఆ పార్టీ మంత్రులు కూడా ఒక కారణముగా చెప్పవచ్చు.ఆ మంత్రులలో సినీ నటి రోజా ఒకరు.రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైసీపీ పార్టీ లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్ గా ఎదిగింది.వైసీపీ పార్టీ గురించి గాని ,జగన్ గురించి గాని ఎలాంటి విమర్శలు చేసిన వెంటనే వారిపై రోజా విరుచుకుపడుతుంది.గతంలో టీడీపీ ,ప్రజారాజ్యం పార్టీలో చేరిన రోజా అక్కడ మనుగడ సాగించలేక జగన్ సమక్షంలో వైసీపీ లో చేరింది.2014 ఎన్నికలలో రోజా నగరి నియోజకవర్గం నుండి గెలుపొందారు. అలాగే 2019 లలో కూడా రోజా నగరి నుండి విజయం సాధించింది.2019 లో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో రోజాకు మంత్రి పదవి దక్కింది. రోజా క్రీడా ,పర్యాటక శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టారు.మంత్రి గా వున్న రోజా అవినీతి పాల్పడ్డారని సొంత నియోజకవర్గ కార్యకర్తలే ఆమెపై తిరుగుబాటు చేసారు.దీనితో 2024 ఎన్నికలలో రోజా ఓడిపోయింది.వైసీపీ కూడా ఘోర ఓటమి చవి చూసింది.
ప్రస్తుతం వైసీపీ కష్టకాలంలో వున్న సమయంలో రోజా ఆ పార్టీకి అందుబాటులోకి లేకపోవడంతో అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా రోజా చాలా హాట్ కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ లైమ్లైట్ పాలిటిక్స్లో ఉండే వాళ్లు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తూ తనదైన స్టైల్ రాజకీయం చేశారు. గతంలో కూడా ఆమె చాలా సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఇంత సైలెంట్గా ఉన్నది లేదు. కానీ ఇప్పుడు పూర్తిగా భిన్నంగా మారిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదట్లో ఒకట్రెండు సార్లు జగన్ చేసిన రివ్యూలకు హాజరయ్యారు. తర్వాత కొన్ని రోజుల పాటు నగరిలో తిరిగినప్పటికీ ఆ తర్వాత అటు రావడం మానేశారని అంటున్నారు. ఎక్కువ ఫ్యామిలీతో గడుపుతున్నారు.
రీసెంట్ గా ఫారెన్ టూర్ కి వెళ్లిన రోజా అక్కడ పొట్టి డ్రెస్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచింది.ఆ ఫొటోలతో ఆమెను ప్రత్యర్థులు తెగ ట్రోల్ చేస్తున్నారు. గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫొటోలతో ఆమెపై విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా ఆమె సైలెంట్గా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె పేరుగా గట్టిగానే వినిపిస్తోంది. ఇదిలా ఉంటే రోజాపై ఇంకో వార్తను కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆమె ఏపీ రాజకీయాలను వదిలేశారని తమిళనాడు రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఓ వార్త వైరల్ అవుతుంది.తమిళ్ స్టార్ హీరో విజయ్ స్థాపించిన పార్టీలో రోజా చేరుతున్నారని ప్రచారం చేస్తున్నారు. అందుకే ఎక్కువ సమయం తమిళనాడులో ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే వైసీపీ నుండి వలసలు మొదలవడంతో త్వరలోనే వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి రావొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.