జగన్ బుల్లెట్ ఫ్రూప్ కార్... ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..!
ఈ విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ తరపు న్యాయవాదుల వాదనల ప్రకారం గతంలో ఆయనకు కల్పించిన సెక్యూరిటీని పునరుద్ధరించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా తనకి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ప్రయాణించడానికి అనుకూలంగా లేదని జగన్ తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే జామర్ వెహికల్ కూడా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం జగన్కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటని ?ప్రశ్నించింది.
ఈ సందర్భంగా స్పందించిన అడ్వకేట్ జనరల్... ప్రత్యామ్నాయ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, జామర్ వెహికల్ ఏర్పాటు చేసే విషయంలో అధికారులను వివరాలు అడిగి సమర్పిస్తామని చెప్పింది. ఇక జగన్ భద్రత ఈ యేడాది జూన్ 3 కు ముందు వరకు ఎలా ఉందో ? అలాగే పునరుద్ధ రించాలని జగన్ కోరుతున్నారు. ఇక ఏపీలో దీనిపై రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక కూటమి నేతల వెర్షన్ మరోలా ఉంది. పులివెందుల ఎమ్మెల్యేకి.. సీఎంకి, పీఎం కి ఇచ్చినంత సెక్యూరిటీ ఇవ్వరని కూటమి నేతలు కౌంటర్లు వేస్తున్న నేపథ్యంలోనే హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.