20 వేల ఎలుకల ఫుడ్ తింటే.. కోటీశ్వరులు కావడం గ్యారెంటీ ?

frame 20 వేల ఎలుకల ఫుడ్ తింటే.. కోటీశ్వరులు కావడం గ్యారెంటీ ?

Veldandi Saikiran
ప్రపంచంలోని వింతైన దేవాలయాలలో కర్ణిమాత ఆలయం కూడా ఒకటి. రాజస్థాన్ లోని బికనీర్ నగరం నుండి 30 కిలోమీటర్ల దూరంలో దేశ్నోక్ అనే గ్రామంలో ఈ శక్తిపీఠాన్ని 15వ శతాబ్దంలో గంగా సింగ్ అనే రాజు నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ దేశ్నోక్ గ్రామాన్ని గతంలో "దస్ నోక్" అని పిలిచేవారు. పది చిన్న గ్రామాల మూలాల భాగాల నుండి ఈ గ్రామం ఏర్పడింది కాబట్టి ఆ పేరు వచ్చిందని చెబుతారు. జ్యోధ్ పూర్, బికనీర్ రాజవంశీయులకు కర్ణిమాత కులదైవం. మొఘలుల శిల్పకళ నైపుణ్యం ఈ ఆలయ గోడల మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆలయ ముందు భాగం పాలరాతి వైభవంతో విరాజిల్లుతుంది. అలాగే వెండి తాపడంతో చేసిన ద్వారాలు అబ్బురపరుస్తాయి. హిందువుల దేవత అయిన దుర్గామాత మరో అవతారమే కర్ణిమాతగా కొలుస్తారు. ఈ ఆలయంలో అమ్మవారు సింధూరం రాసిన ఏకశీల మీద చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. ఓ చేత త్రిశూలం, మరోచేత రాక్షస తల పట్టుకొని సింహవాహినిగా భక్తుల చేత అమ్మవారు పూజలు అందుకుంటుంది.
ఇక ఈ ఆలయంలో దాదాపు 20 వేలకు పైగా ఎలుకలు ఉన్నాయి. హిందూ సంప్రదాయంలో ఎలుకను గణపతి వాహనముగా పరిగణిస్తారు. కానీ ఇక్కడ ఈ ఎలుకలను కర్ణిమాత సేవకులుగా పిలుస్తారు. ఈ ప్రసిద్ధ ఎలుకలను కబ్బాలు అని కూడా పిలుస్తారు. కర్ణిమాత బాల్యం నుండి దుర్గాదేవి ఉపాసకురాలు. ఈమె 150 సంవత్సరాలు జీవించిందని తెలుస్తోంది. కర్ణిమాతకు పుట్టుకతోనే అతీంద్రియ శక్తులు ఉండేవని ప్రచారం.
ఆ శక్తులతో భక్తులు, పేదల సమస్యలు పరిష్కరించడంతో అందరూ ఆమెను దేవతల కొలవడం ప్రారంభించారు. ఓ రోజు కర్ణిమాత అకస్మాత్తుగా తన ఇంట్లోనే అదృశ్యమవుతుంది. ఆ తర్వాత ఆమెకు అక్కడే ఆలయం నిర్మించి అప్పటినుండి పూజలు జరిపారు. అయితే కొంతకాలానికి ఆమె భక్తులతో మాట్లాడిందని, తమ వంశస్తులంతా త్వరలో చనిపోతారని, వారంతా ఎలుకలుగా జన్మించి ఇక్కడే ఉంటారని, వారికి అన్న పానీయాలు సమర్పించి ధన్యులు కమ్మని కర్ణిమాత చెప్పిందట.

అలా కర్ణిమాత చెప్పిన విధంగానే జరగడంతో వారంతా అప్పటినుండి ఎలుకలను పూజించడం మొదలుపెట్టారు. ఆ ఆలయానికి వచ్చిన  భక్తులు పెట్టిన నైవేద్యాలను, పాలు, పెరుగు, పండ్లు వంటి వాటిని ఎలుకలు ఆరగిస్తుంటాయి. అయితే ఈ ఆలయంలో ఎలుకలు మీ కాళ్ళ కింద పడకుండా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. పొరపాటున ఏదైనా ఎలుక కాళ్ల క్రింద పడి మరణిస్తే అపవిత్రతకు కారణమైన వ్యక్తి ఆ ఎలుక విగ్రహాన్ని బంగారంతో తయారు చేయించి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ ఆలయంలో దాదాపు అన్ని నల్ల ఎలుకలే భక్తులకు కనిపిస్తాయి. కానీ అప్పుడప్పుడు కొందరికి ఇక్కడ తెల్ల ఎలుకలు కూడా కనిపిస్తూ ఉంటాయి.

ఈ తెల్ల ఎలుకలు కనిపించిన వారికి కర్ని మాత అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. అయితే ఈ తెల్ల ఎలుకలు కేవలం కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో మాత్రమే కనిపిస్తాయట. ఇక ఆలయంలో అమ్మవారికి సమర్పించే ప్రసాదాన్ని ముందుగా ఎలుకలు తింటాయి. అనంతరం ప్రజలు దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్నోక్ అనే గ్రామంలో ఈ ఆలయం ఉంటుంది. బికనేర్ చేరుకోవడానికి జోద్పూర్ లో అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక బికనేర్ నుంచి దేశ్నోక్ చేరుకోవడానికి బస్సు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయానికి ఏడాది పొడవున వేలాదిమంది పర్యాటకులు, భక్తులు విచ్చేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: