• ఏపీలో ఎక్కువగా జరుగుతున్న పొలిటికల్ సెలబ్రిటీల అరెస్ట్స్
• జగన్ వచ్చాక పెరిగిన ఈ అరెస్టులు
• దేవినేని ఉమా అరెస్ట్ అప్పట్లో సంచలనం
( ఏపీ - ఇండియా హెరాల్డ్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఎవరైనా తప్పు చేస్తే, లేదంటే తమను ఇబ్బందులకు గురి చేస్తే వారిని అధికార పార్టీ వాళ్ళు వెంటనే అరెస్టులు చేయిస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో జగన్ టీడీపీ సీనియర్ నేత కె.అచ్చెన్నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు లాంటి ప్రముఖులను అరెస్టు చేయించారు. టీడీపీ నేత దేవినేని ఉమాని కూడా అరెస్ట్ చేశారు. అతని అరెస్టు ఏపీలో పెద్ద సంచలనం సృష్టించింది. చాలామంది దీన్ని ఖండించారు. పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు.
కృష్ణా జిల్లాకు చెందిన రైతు నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మొదటి నుంచీ టీడీపీలోనే కొనసాగారు. ఏపీలో 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2004 ఎన్నికల్లో నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు. 2014లో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక జలవనరుల నిర్వహణ శాఖ మంత్రిగా కూడా ఎన్నికయ్యారు. అయితే 2024లో ఆయనకు సీటు ఇవ్వలేదు.
దేవినేని ఉమా మహేశ్వరరావు 2011 నవంబర్‌లో మొదటసారిగా అరెస్టు అయ్యారు. రచ్చబండ పేరుతో ప్రజా సంప్రదింపు కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆయన ప్రభుత్వ అధికారులను అడ్డుకున్నారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దాంతో పోలీసులు దేవినేని ఉమాను అరెస్టు చేశారు. మళ్లీ 2021, జులై 28న జగన్ ఆయన్ను అరెస్టు చేయించారు. కృష్ణా జిల్లాలోని జి. కొండూరు పోలీసు స్టేషన్‌లో అల్లర్లకు పాల్పడినట్లు ఆరోపిస్తూ దేవినేని ఉమాతో పాటు మరో 17 మందిని మళ్లీ అరెస్టు చేశారు.
రెండు రోజుల తర్వాత కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌ను సందర్శించకుండా పోలీసులు ఉమా మహేశ్వరరావును, కొంతమంది తెలుగుదేశం నాయకులను గృహనిర్బంధంలో ఉంచారు. 2024 ఎన్నికలలో రావు ఏ స్థానానికి నామినేట్ కాలేదు, అనేక దశాబ్దాలుగా దేవినేని రేసులో ఉన్నారు కానీ ఈసారి ఆయనను పక్కకు తప్పించడం షాకింగ్ గా అనిపించింది.