టూత్ బ్రష్ మింగేసిన మహిళ.. చివరికి ఏమైందో తెలిస్తే..?

frame టూత్ బ్రష్ మింగేసిన మహిళ.. చివరికి ఏమైందో తెలిస్తే..?

Suma Kallamadi


సాధారణంగా పిల్లలు నోట్లో ఏదైనా వస్తువు పెట్టుకుని దాన్ని అలాగే మింగేస్తుంటారు. ఒక్కోసారి పెద్దలు కూడా పొరపాటున టూత్ బ్రష్‌ల వంటివి మింగేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. అయితే తాజాగా అమెరికాకు చెందిన అంబర్ అనే మహిళ అజాగ్రత్తగా ఉండి పళ్లు తోముకునే టీత్ బ్రష్‌ను మింగేసింది! క్రోయేషియాలో తన కుటుంబంతో సరదాగా గడుపుతుండగా, ఆమె అనుకోకుండా ఈ భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొంది. 

జూలై 27వ తేదీన, నిద్రకు ముందు దంతాలు తోముకుంటుండగా, ఆమె చేతి నుంచి 20 సెంటీమీటర్ల పొడవున్న దంత బ్రష్ జారిపోయి నేరుగా గొంతులోకి వెళ్లిపోయింది. అంబర్ కంగారుతో బ్రష్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు. దీంతో భర్త ఆమెను క్రోయేషియాలోని కాకోవేక్‌లోని కౌంటీ హాస్పిటల్ కాకోవేక్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె కడుపుకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంది. డాక్టర్లు ఆమె కడుపులో దంత బ్రష్ ఉందని నమ్మలేదు.

దీంతో ఆమె ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్లి, మరుసటి రోజు మళ్లీ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వారు ఆమె గొంతులోకి ఒక కెమెరాను ప్రవేశపెట్టి, బ్రష్‌ను తీయడానికి ప్రయత్నించారు. కానీ అలా తీయడం సాధ్యం కాలేదు. చివరకు, అంబర్‌ను స్ప్లిట్‌లోని కేబీసీ స్ప్లిట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ 45 నిమిషాల సర్జరీ చేసి బ్రష్‌ను తీసేశారు. డాక్టర్లు ఆమె గొంతులోకి ఒక కెమెరాను ప్రవేశపెట్టి దాని చుట్టూ ఒక తీగను చుట్టి, బ్రష్‌ను పట్టుకొని బయటకు లాగారు. ఈ ప్రక్రియ అంతా అంబర్ మేల్కొని ఉన్నప్పుడే జరిగింది.

ఒహయో రాష్ట్రంలో అంబర్ ఒక హౌస్ వైఫ్ గా ఉంటుంది. క్రోయేషియాలో సెలవులు ఎంజాయ్ చేయడానికి వచ్చింది కానీ అది ఆమెకు ఒక పీడకలలా మారింది. దీనివల్ల చాలా భయపడింది కానీ అదృష్టవశాత్తు ఆమె ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడింది. తాను బతికి ఉన్నందుకు చాలా సంతోషించింది. ఇకపై దంతాలు తోముకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పుకొచ్చింది. ఇలాంటి ప్రమాదం ఎవరికీ జరగకూడదని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: