టీడీపీ నేతలకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త..వారంలోగా ఆ పోస్టులు భర్తీ?

frame టీడీపీ నేతలకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త..వారంలోగా ఆ పోస్టులు భర్తీ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం క్యాడర్ కు అదిరిపోయే శుభవార్త చెప్పారు చంద్రబాబు నాయుడు.164 స్థానాలతో ఇటీవల... ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టిన చంద్రబాబు నాయుడు సర్కార్... కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో వైసీపీ పై కూడా ప్రతీకారం తీసుకుంటుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.

ఇప్పటికే వైసీపీలో ఉన్న చాలా మంది ఫైర్ బ్రాండ్ నేతలపై కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు సర్కార్.. వైసిపి నేతలను ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కష్టపడుతున్న నేతలు కోసం... చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే... ఈ నెల 8వ తేదీన టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 8వ తేదీన టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో నామినేటెడ్ పోస్టులపై చర్చ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారట చంద్రబాబు నాయుడు. అంతేకాదు.... కూటమి పార్టీల మధ్య నామినేటెడ్ పదవుల పంపకాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వారంలోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తీసుకున్నారు టీడీపీ పార్టీ నేతలు. విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిత్వం ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు సమచారం అందుతోంది.
ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి.. పార్టీకి సమన్వయం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ ఉంటుందని సమాచారం. టీడీపీకి అందుతున్న ఫిర్యాదుల పరిష్కారంపై ఓ మెకానిజం రూపొందించే అంశం పైనా పొలిట్ బ్యూరోలో చర్చ ఉండనుందట. ఇక వారంలోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టే అవకాశం ఉన్న తరుణంలో ఆశా వాహులు సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: