ఏపీ చరిత్రను తిరగరాసిన నందమూరి ఫ్యామిలీ.. ఆ నియోజకవర్గంలో తిరుగులేదుగా!
పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే ఆ పార్టీని అధికారంలోకి తీసుకొనిరావడం సులువైన విషయం కాదు. అయితే సీనియర్ ఎన్టీఆర్ మాత్రం అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేశారు. 2 రూపాయలకే కేజీ బియ్యం, మద్యపాన నిషేధం, పటేల్ పట్వారీ విధానం రద్దు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ఆయన అమలు చేయడం జరిగింది. ఈ పథకాలలో చాలా పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయనే సంగతి తెలిసిందే.
సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన హరికృష్ణ, బాలకృష్ణ తమ రాజకీయాలతో సత్తా చాటారు. హరికృష్ణ జీవించి ఉన్నంత వరకు వేర్వేరు పదవులను స్వీకరించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారనే సంగతి తెలిసిందే. బాలయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.
నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆయన ఆ పదవిపై ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. బాలయ్య భవిష్యత్తులో రాజకీయాలపై మరింత దృష్టి పెట్టే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్యను మంత్రి పదవిలో చూడాలని అభిమానులు కోరుకుంటుండగా ఆ కోరిక భవిష్యత్తులో నెరవేరుతుందేమో చూడాలి. నందమూరి ఫ్యామిలీ నుంచి రాబోయే రోజుల్లో మరి కొందరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. నందమూరి హీరోలకు క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.